Bharat-china: భారత్-చైనా ఉద్రిక్తతలు: పౌర విమానాల పునఃప్రారంభంపై కేంద్రం ఆలోచన

Published : May 24, 2025, 11:49 AM IST
Goa to delhi cheapest flight

సారాంశం

చైనా పాక్‌కు మద్దతు ఇచ్చిందన్న నిఘా నివేదికలపై కేంద్రం స్పందన, భారత్-చైనా విమానాల పునఃప్రారంభంపై తిరిగి సమీక్ష.

ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో చైనా, పాక్‌కు సాయం చేసినట్టు నిఘా సంస్థల సమాచారం వెలుగులోకి వచ్చింది. మే నెలలో సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో చైనా, పాకిస్తాన్‌కు నిఘా సమాచారంతో పాటు, టెక్నికల్ సపోర్ట్ కూడా ఇచ్చిందని కేంద్ర రక్షణ శాఖకు చెందిన జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్ కేంద్రం నివేదిక తెలిపింది. పాక్ రాడార్ వ్యవస్థలు తిరిగి అమర్చేందుకు చైనా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

ఈ పరిణామాలపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. చైనా విమాన సేవలు పునఃప్రారంభం చేసేందుకు భారత్ ముందుకు వెళ్లకముందే ఈ ఆరోపణలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియమించారు.

సీనియర్ అధికారుల మాటల ప్రకారం, చైనా మద్దతు వాస్తవమేనని నిరూపితమైతే, చైనా పౌర విమానాలకు భారత్ అనుమతి ఇవ్వడం వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికీ భారత్-చైనా మధ్య కార్గో సేవలు కొనసాగుతున్నా, పౌర విమానాలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తే ముందు భారత ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించనుంది.

ఇదే సమయంలో, పౌర విమానయాన శాఖ, విదేశాంగ శాఖలతో పాటు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు కేంద్రం వివరణ కోరినప్పటికీ, స్పందన రాలేదు. జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్ డైరెక్టర్ అశోక్ కుమార్ వెల్లడించిన మేరకు, చైనా సాంకేతిక సహకారంతో పాకిస్తాన్ తమ నిఘా వ్యవస్థను మెరుగుపరుచుకొని, భారత వైమానిక శక్తిపై మరింత వ్యూహాత్మక అవగాహనను పొందిందని చెప్పారు.

గత నెలలో కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆపై డ్రోన్ దాడులు, వైమానిక ప్రతీకార చర్యలు ఈ మిలిటరీ ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇవి గత రెండు దశాబ్దాల్లోనే అతిపెద్ద సైనిక ఘర్షణలుగా చెబుతున్నారు.

గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య నిలిచిన విమాన సేవలు తిరిగి ప్రారంభించాలనే యోచనపై చర్చలు జరుగుతుండగానే, చైనా పాక్‌కు మద్దతిచ్చిన వార్తలు బయట పడటం వల్ల ఈ అంశంపై భారత్ తిరిగి ఆలోచనలో పడింది. కైలాస్ యాత్ర మార్గాల పునఃప్రారంభం, చైనా ప్రధాన నగరాలకు విమానాలు నడిపే అంశాలపై చర్చలు జరుగుతుండగా, తాజా ఉద్రిక్తతలు ఈ ప్రక్రియకు ఆటంకంగా మారే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..