పాకిస్తాన్ వరదలు.. 1,700కు చేరిన మృతుల సంఖ్య.. 12,000 మందికి పైగా గాయాలు

By team teluguFirst Published Oct 8, 2022, 8:55 AM IST
Highlights

పాకిస్థాన్ వరదల వల్ల 17 వందల మంది చనిపోయారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొంది. ఈ వరదల వేల మంది నిరాశ్రయులు అయ్యారని తెలిపింది. 

ఈ ఏడాది పాకిస్థాన్ లో సంభవించిన భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,700కు చేరుకుందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) తెలిపింది. అలాగే దేశంలో వరద సంబంధిత ఘటనల్లో 12,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ విపత్తు కారణంగా పాకిస్తాన్ సుమారు 40 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

మంచూరియా తినలేదని మనవడి ఘాతుకం.. అమ్మమ్మను కొట్టి చంపి, శవాన్ని గోడలో పూడ్చి పరార్.. ఆరేళ్ల తరువాత...

ఈ వ‌ద‌రల కార‌ణం వ‌ల్ల మృతి చెందిన వారిలో 632 మంది చిన్నారులు, 340 మంది మహిళలు ఉన్నారని ఎన్డీఎంఏ తెలిపింది. 763 మరణాలతో సింధ్ జిల్లా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా.. 336 మంది ప్రాణాలు కోల్పోయిన బలూచిస్థాన్ తర్వాతి స్థానంలో ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 300 మందికి పైగా మరణించగా, పంజాబ్ ప్రావిన్స్ లో 221 మంది చ‌నిపోయారు. 

వరదల్లో 20 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 11 ల‌క్ష‌ల పశువులు వరదల్లో మరణించాయి. ఎన్డీఎంఏ, ఇతర ప్రభుత్వ సంస్థలు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.వరదల కారణంగా పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. 

విషాదం : మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు.. ఎనిమిదిమంది సజీవదహనం...

గ్లోబల్ వార్మింగ్ ప్రభావాల కారణంగా హిమానీనదాలు కరిగిపోవడంతో దేశంలో మూడింట ఒక వంతు మునిగిపోయింది. దేశ వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్ ప్రకారం.. సుమారు ఎనిమిది మిలియన్ల మందికి అత్యవసర వైద్య సేవలు అవసరం. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఈ ఏడాది ఇప్పటివరకు 2,08,000 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఐక్యరాజ్యసమితి ‘సెకండ్ వేవ్’ విపత్తుపై హెచ్చరించింది.

Solar eclipse 2022 : ఈ యేడాది పాక్షిక సూర్యగ్రహణం.. ఎప్పుడంటే..
కాగా.. వ‌ర‌ద‌ల వల్ల  పాకిస్థాన్ అత‌లాకుత‌లం అయ్యింది. ఈ విప‌త్తు వ‌ల్ల ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. జ‌నజీవ‌నం అస్త‌వ్య‌స్థంగా మారింది. అయితే ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల తాగు నీరు కూడా క‌లుషితంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఈ కలుషిత నీటి ద్వారా వ్యాధులు ప్ర‌బ‌లుతున్నాయి. డయేరియా, చర్మవ్యాధులు, కంటి ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయి. గతంలో ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం..అత్యంత దెబ్బతిన్న ప్రావిన్స్‌లలో ఒకటైన సింధ్‌లో 90,000 పైగా డయేరియా కేసులు ఒక్క రోజులోనే వెలుగులోకి వచ్చాయి. 

click me!