చైనా కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టిన పాకిస్తాన్.. కారణమిదే!

By telugu teamFirst Published Oct 17, 2021, 8:43 PM IST
Highlights

పాకిస్తాన్ ఓ చైనా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రభుత్వ ప్రాజెక్టుకు ఆహ్వానించిన టెండర్లలో నకిలీ దస్త్రాలు మర్పించిందనే ఆరోపణలపై పాకిస్తాన్‌కు చెందిన ఎన్‌టీడీసీ చైనా కంపెనీపై వేటు వేసింది. నెల రోజులపాటు ఎన్‌టీడీసీ నిర్వహించే టెండర్ ప్రక్రియలో ఈ కంపెనీ పాల్గొనరాదని తెలిపింది.
 

ఇస్లామాబాద్: Pakistanకు డ్రాగన్ కంట్రీ China అండదండలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి పాకిస్తాన్‌కు మద్దతునిస్తూ వస్తున్నది. దేశంలో పెట్టుబడులే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆ దేశానికి వీలైనప్పుడు వత్తాసు పలుకుతున్నది. తాజాగా, చైనా కంపెనీపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ కంపెనీని నెల రోజులు Blacklistలో పెట్టింది.

పాకిస్తాన్‌లో ఓ ప్రభుత్వ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు. దానికి చైనాకు చెందిన ఓ కంపెనీ Tender వేసింది. కానీ, టెండర్ డాక్యుమెంట్లు నకిలీవని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ నేషనల్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్పాచ్ కంపెనీ(ఎన్‌టీడీసీ) నకిలీ పత్రాలను సమర్పించిన చైనా కంపెనీపై వేటు వేసింది. నెల రోజుల పాటు మళ్లీ  అన్ని ఎన్‌టీడీసీ టెండర్ ప్రాసెస్‌లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎన్‌టీడీసీ జనరల్ మేనేజర్ కార్యాలయం నుంచి వెలువడ్డ ఈ లేఖపై పాకిస్తాన్ మీడియా కథనాలు వెలువరించాయి.

Also Read: Taliban: ఆఫ్ఘనిస్తాన్‌కు ఫ్లైట్స్ నిలిపేసిన పాకిస్తాన్.. తాలిబాన్ల జోక్యం హద్దుమీరిందని ప్రకటన

అయితే, ఈ నిషేధం కేవలం భవిష్యత్ కాలానికే వర్తిస్తుందని ఎన్‌టీడీసీ స్పష్టం చేసింది. ఇప్పటికే అమలవుతున్న కాంట్రాక్టులకు ఈ నిబంధన వర్తించదని తెలిపింది. పాకిస్తాన్‌లో మౌలిక వసతులు, పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అనేక పనులను చైనా కంపెనీలు కాంట్రాక్టు తీసుకున్నాయి.

click me!