India vs Pakistan : పాకిస్తాన్ సైన్యంలో తిరుగుబాటు? అసీం మునీర్ అరెస్ట్ - Fact Check

Published : May 09, 2025, 12:48 AM ISTUpdated : May 09, 2025, 09:35 AM IST
India vs Pakistan : పాకిస్తాన్ సైన్యంలో తిరుగుబాటు? అసీం మునీర్ అరెస్ట్ - Fact Check

సారాంశం

India vs Pakistan: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం అధిపతి జనరల్ అసీం మునీర్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. మర అవి నిజమేనా?

India vs Pakistan : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం రాత్రి పాకిస్తాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. ఈ గందరగోళం నేపథ్యంలో, పాకిస్తాన్ సైన్యం అధిపతి జనరల్ అసీం మునీర్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా పాకిస్తాన్ సైన్యం పగ్గాలు చేపట్టినట్లు చెబుతున్నారు. అయితే అది నిజం కాదని తేలింది.

అసలు వార్త..

వ్యక్తిగత ఆశయాల కోసం దేశాన్ని గందరగోళం, వ్యూహాత్మక పతనానికి దారితీసినందుకు జనరల్ మునీర్‌పై ఆరోపణలు ఉన్నాయని వార్తలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం నుంచి అధికారిక ధ్రువీకరణ ఇంకా రావాల్సి ఉంది. అయితే, ఉన్నతాధికారుల్లోని ఒక వర్గం మునీర్ నాయకత్వంపై చాలా కాలంగా అసంతృప్తితో ఉందని, అంతర్గత అస్థిరత, దౌత్య వైఫల్యాలను మరింత తీవ్రతరం చేసినందుకు ఆయనను నిందించారని వార్తలు వస్తున్నాయి.

2019 ఫిబ్రవరి 14న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 40 మంది సిబ్బంది మరణించిన పుల్వామా ఉగ్రదాడిని పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ లేదా ISI ఆర్కెస్ట్రేట్ చేసినప్పుడు అసీం మునీర్ దాని అధిపతిగా ఉన్నారు.

ఆరు సంవత్సరాల తర్వాత, పాకిస్తాన్ వాస్తవ సుప్రీమో అయిన మునీర్ మళ్లీ భారతదేశం క్రాస్‌హైర్‌లలో ఉన్నారు. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ఆయనే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మరణించారు.

వాస్తవానికి ఏం జరిగిందంటే.. గురువారం రాత్రి పై వార్తను పలు మీడియా చానెళ్లు రిపోర్ట్ చేశాయి. అయితే ఇవన్నీ ధృవీకరణ కాలేదని... ఇలాంటి సంఘటన ఏమీ జరుగలేదని పాకిస్తాన్ అధికారులు.. ప్రభుత్వం పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..