హెచ్-1 బీ వీసా ఎఫెక్ట్: 2 లక్షల మంది జూన్ తర్వాత ఇంటికేనా?

By narsimha lodeFirst Published Apr 29, 2020, 1:36 PM IST
Highlights

ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులు అమెరికాలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. రెండు మాసాల్లో ఉద్యోగం సంపాదించకపోతే అమెరికాను వీడాల్సిందే. 


వాషింగ్టన్: ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులు అమెరికాలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. రెండు మాసాల్లో ఉద్యోగం సంపాదించకపోతే అమెరికాను వీడాల్సిందే. ఈ రకంగా ఈ ఏడాది జూన్ నాటికి సుమారు రెండు లక్షల మంది అమెరికాలో నివాసం ఉండే చట్టబద్దతను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్- 1  బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెండు నెలల్లో ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం పొందలేకపోతే అమెరికాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఈ  మేరకు అమెరికాలో నిబంధనలను మార్చారు.

also read:ఈ ఆరు లక్షణాలు కూడ కరోనాకు సూచికలే: సీడీసీ అధ్యయనం

అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. స్థానికులకు ఉపాధికి రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ సర్కార్ ఇటీవల కాలంలో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. వలసలన్నింటిని రెండు మాసాల పాటు తాత్కాలికంగా బ్యాన్ చేసింది. కొత్త వీసాలు, గ్రీన్ కార్డుల జారీ చేసే ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నవారికి ఈ నిబంధనలు మాత్రం వర్తించవని అమెరికా స్పష్టం చేసింది.

అమెరికాలో శాశ్వత నివాసం లేకుండా హెచ్-1 బీ వీసాతో పాటు ఇతర వీసాలపై ఆధారపడి విధులు నిర్వహిస్తున్నవారికి కష్టాలు తప్పేలా లేవు. అమెరికాలో గెస్ట్ వర్కర్ వీసా కింద పనిచేస్తున్న వారిలో రెండున్నర లక్షల మంది గ్రీన్ కార్డు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో రెండు లక్షల మంది హెచ్-1 బీ వీసా గడువు జూన్ చివరి  నాటికి ముగియనుంది.కరోనా కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. 

అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్లకు వీసాల గడువును పొడిగించాలని భారత ప్రభుత్వం అమెరికాను కోరింది.ఈ విషయమై అమెరికా కూడ సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. 

click me!