ట్రంప్ కి ప్రతిపక్షం సూపర్ పంచ్: డెటాల్, లైజాల్ ల కన్నా ఐస్ క్రీములే నయమట!

By Sree s  |  First Published Apr 29, 2020, 9:54 AM IST

అమెరికాలోని హౌస్  ఆఫ్  రిప్రజెంటేటివ్స్,    మేము సమావేశాలకు ఇంకో నెలరోజులవరకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నందున తాము ఇండ్లకే పరిమితం అవుతున్నట్టుగావారు చెబుతున్నారు.


మన దేశంలో లోక్ సభ, రాజ్య సభ లాగా అమెరికాలో హౌస్ ఆఫ్  రిప్రజెంటేటివ్స్, సెనేట్ అని రెండు సభలుంటాయి(పని తీరు, ఎన్నికలను పక్కనపెడితే). అమెరికాలోని హౌస్  ఆఫ్  రిప్రజెంటేటివ్స్,    మేము సమావేశాలకు ఇంకో నెలరోజులవరకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. 

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నందున తాము ఇండ్లకే పరిమితం అవుతున్నట్టుగావారు చెబుతున్నారు. సభ లీడర్ హోయెర్ మాట్లాడుతూ... ఈ నిర్ణయాన్ని సభ స్పీకర్ తో కలిసి తీసుకున్నట్టుగా చెప్పారు. డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియాలో కరోనా విజృంభిస్తున్నందున తాము సభకు రావొద్దని తీర్మానించినట్టు ఆయన అన్నారు. 

Latest Videos

ఈ సమయంలో సభకు రావడమంటే.... సభలో ఉన్న ప్రజాప్రతినిధుల ప్రాణాలను రిస్కులో పెట్టినట్టే అని ఆయన అన్నారు. ఈ హౌస్  ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో డెమొక్రాట్లది మెజారిటీ. మరోపక్క ట్రంప్ నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్లు వచ్చేవారం సెనేట్ సమావేశాలకు హాజరుకానున్నారు. సెనేట్లో అధికార రేపుబ్లికన్లది మెజారిటీ. 

ఇలా సభకు హౌస్  ఆఫ్  రిప్రజెంటేటివ్స్, నెలవరకు రాము అని చెబుతుండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారిపై రాజకీయ దాడులతో విరుచుకుపడుతున్నారు. స్పీకర్ నాన్సీ పెలోసి ఇంట్లో ఐస్ క్రీములు తింటూ వేసవి సెలవులను ఎంజాయ్  చేస్తుందని, దేశం గురించి వారికి పట్టడంలేదని ఆరోపించారు. 

undefined

గత వారం పెలోసి ఒక ఇంటర్వ్యూ లో తన ఫ్రీజర్ నిండా ఉన్న ఐస్ క్రీములను చూపిస్తూ.... ట్రంప్ ప్రజల వంట్లోకి డెటాల్, లైజాల్ లను పంపి కరోనా కు చికిత్స చేయమంటున్నాడు, దానికన్నా ఫ్రిడ్జిలో ఐస్ క్రీములను ఉంచుకోవడం ఎంతో నయం అని ఆమె అన్నారు. 

ఇకపోతే ఈ కరోనా మహమ్మారి మన దేశాన్ని కూడా వదలడం లేదు. దేశంలో కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తూనే ఉంది. తాజాగా, గత 24 గంటల్లో 73 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య వేయి దాటింది. మొత్తం 1007 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధిక మరణాలు రికార్డు కావడం ఇదే తొలిసారి. 

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 31,332కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.  ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7,696 మంది కోలుకున్నారు.

మహారాష్ట్రలో మహమ్మారికి కళ్లెం పడడం లేదు. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,500 సంఖ్యను దాటింది. గుజరాత్ 3,548 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

click me!