కిమ్ అనారోగ్యంపై రాని క్లారిటీ.. ఇక వారసుడు అతనేనా..?

By telugu news teamFirst Published Apr 29, 2020, 11:52 AM IST
Highlights

ఈ క్రమంలో ఎక్కువగా కిమ్‌ చిన్న చెల్లెలు కిమ్‌ యో జంగ్‌ సమర్థురాలిగా కథనాలు వస్తున్నాయి. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. 
 

ఉత్తర కొరియా అధ్యక్సన్ కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  దీనిపై సౌత్ కొరియా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయన క్షేమంగా ఉన్నారని చెప్పింది. 

అయితే..  వాళ్లు ఎంత చెబుతున్నా..కిమ్ మాత్రం బయటకు రావడం లేదు.. ఎలాంటి అధికారిక కార్యక్రమంలోనూ హాజరుకాకపోవడం గమనార్హం. దీంతో ఆయన అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్నే అందరూ నమ్ముతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత ఎవరు అనే ప్రశ్న పై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఎక్కువగా కిమ్‌ చిన్న చెల్లెలు కిమ్‌ యో జంగ్‌ సమర్థురాలిగా కథనాలు వస్తున్నాయి. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కిమ్‌ చిన్నాన్న కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ (65) పేరు బయటికొచ్చింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ వారసుల్లో ప్యాంగ్‌ ఇల్‌ చివరివాడు. ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షుడిగా ఆయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలోని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల అనంతరం రాజకీయంగా ఆయన పేరు వినిపిస్తుండటం గమనార్హం.

1970లో తన అన్న కిమ్‌ జోంగ్‌ ఇల్‌ చేతిలో ఓడిపోయిన తర్వాత.. కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ హంగేరి, బల్గేరియా, ఫిన్‌లాండ్‌, పొలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లో పలు దౌత్యపరమైన పదవుల్లో పనిచేశారు. ఏడాది క్రితం స్వదేశానికి తిరిగొచ్చారు. కిమ్‌ అనారోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. దేశానికి నాయకత్వం వహించే విషయమై కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ను కావాలనే పక్కన పెట్టేశారని, ఆ దేశ మీడియా అతన్ని వెలుగులోకి రానీయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే, ఉత్తర కొరియాలోని కొందరు మేధావులు మాత్రం.. వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ కుమారుడు అయినందున కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ నిజమైన వారసుడు అని, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కానేకాదని చెప్తున్నారు. ఒకవేళ కిమ్‌ ప్రాణాలతో లేకపోతే.. ఇప్పుడైనా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. 

click me!