
మానవ తప్పిదం వల్లే నేపాల్ విమాన ప్రమాదం జరిగిందని ప్రైమెరీ క్రాష్ రిపోర్టు స్పష్టం చేసింది. పైలెట్ ఫ్లాప్స్ లివర్ ను ఉపయోగించే బదులు ఇతర పరికరాన్ని ఉపయోగించడం వల్ల ఈ క్రాష్ జరిగిందని పేర్కొంది. ఈ ప్రమాదంలో మొత్తం 71 మంది చనిపోయారు. ఇందులో ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.
మీ నాన్న లాంటి వాళ్ల వల్లే దేశాభివృద్ధి కుంటుపడుతోంది.. ఎమ్మెల్సీ కవిత కు రాజీవ్ చంద్రశేఖర్ చురకలు..
జనవరి 15వ తేదీన ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఏతి ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 691, రిసార్ట్ సిటీ పోఖారాలోని పాత ఎయిర్ పోర్టు, కొత్త ఎయిర్ పోర్టు మధ్యన ఉన్న సేతి నది సమీపంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంపై అప్పటి నుంచి పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలెట్లలో ఒకరు విమానాన్ని ల్యాండింగ్ కోసం కాన్ఫిగర్ చేయడానికి కాక్‌పిట్‌లోని ఫ్లాప్స్ లివర్‌ని ఉపయోగించే బదులు, రెక్కలను ఆపరేట్ చేసే లివర్‌లను ఉపయోగించారని ఆపరేట్ చేశారు. దీంతో ఇంజన్ లోని ఎనర్జీ ఒక్క సారిగా జీరోకు వచ్చిందని ‘ఎన్డీటీవీ’ కథనం నివేదించింది.
ఆ తర్వాత నిమిషంలోనే ఏటీఆర్-72 విమానం ఆగిపోయి కుప్పకూలిపోయింది. రెండు ఇంజిన్ల ప్రొపెల్లర్లు రెక్కలు ఆగిపోవడంతో విమానం అదుపుతప్పి కిందపడిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తడం చాలా అరుదుగా జరుగుతుందని నివేదిక పేర్కొంది. ‘‘ల్యాండింగ్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) క్లియరెన్స్ ఇచ్చినప్పుడు.. ఇంజిన్ల నుంచి విద్యుత్ రావడం లేదని పైలట్ ఫ్లయింగ్ (పీఎఫ్ ) రెండుసార్లు పేర్కొంది.’’ అని నివేదిక తెలిపింది.
శృంగారానికి నిరాకరించిందని భార్యను చంపిన భర్త.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన చెన్నై కోర్టు
అయితే ప్రమాద సమయంలో విమానం ఇంజిన్లు పూర్తిగా పని చేశాయి. ఈ విమానాన్ని ఇద్దరు కెప్టెన్లు నడుపుతున్నారు. ఇందులో ఒకరు పోఖారాలో కార్యకలాపాలను తెలుసుకునే ప్రక్రియలో ఉన్నారు. మరొక కో పైలట్ ఇన్ స్ట్రక్టర్ పైలట్. ఆ ఎయిర్ లైన్స్ లోని ఆరుగురు మహిళా పైలట్లలో ఒకరైన అంజు ఖతివాడా ఈ విమానంలో ఇన్ స్ట్రక్టర్ పైలట్ గా ఉన్నారు. ఆమె భర్త దీపక్ పోఖ్రెల్ అదే ఎయిర్ లైన్స్ లో ప్రయాణించి 2006లో జరిగిన ప్రమాదంలో మరణించారు.
ఈ ప్రమాదాన్ని కొందరు భారతీయ ప్రయాణికులు ప్రత్యక్షంగా చిత్రీకరించారు. యూపీకి చెందిన పలువురు యువకులు ల్యాండింగ్ విజువల్స్ ను తమ ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. అయితే అదే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటన అందులో రికార్డు అయ్యింది. ఆ వీడియోల్లో యువకులు ఉల్లాసంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఒక్క సారిగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విజువల్స్ కూడా అందులో రికార్డు అయ్యాయి.
లైఫ్ మిషన్ కేసు : వెలుగులోకి శివశంకర్, స్వప్న సురేష్ వాట్సప్ చాట్‌లు..
ఈ ప్రమాదం జరిగిన విమానంలో నలుగురు సిబ్బంది సహా 72 మంది ఉన్నారు.అయితే సహాయక సిబ్బంది కేవలం 71 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. గల్లంతైన ప్రయాణికుడు కూడా మృతి చెందినట్లు భావిస్తున్నారు. కాగా.. నేపాల్ ప్రపంచంలోనే అత్యంత చెత్త ఏవియేషన్ సేఫ్టీ రికార్డులను కలిగి ఉంది.