బలవుంతులు... బలహీనులను భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్... బలహీనుడు.. బలవంతుడిని భయపెడితే... ఈ డైలాగో ఎక్కడో విన్నట్లు ఉంది కదా..? జనతా గ్యారేజ్ మూవీలో డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఈ కింది వీడియోలో కనపడుతున్న మహిళకు కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా..? మామూలుగా.. ఎవరైనా అబ్బాయిలు తమను ఏడిపించినా, తాకినా, ఇబ్బందిగా ప్రవర్తించినా.. అమ్మాయిలు చాలా భయపడిపోతూ ఉంటారు. వారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి పారిపోతూ ఉంటారు. కానీ ఈ మహిళ మాత్రం అలా భయపడలేదు. తన పట్ల తప్పుగా ప్రవర్తించిన వాడి తుప్పు వదిలించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా... దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 24ఏళ్ల నషాలి అల్మా ఓ ఫిట్నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కూడా. ఆమె రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఉంటారు. కాగా గత నెల జనవరి 22వ తేదీన ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా... ఓ వ్యక్తి ఆమె పై దాడికి యత్నించాడు.
నషాలి భయపడకుండా దాడి చేసిన వ్యక్తి నుండి ధైర్యంగా తనను తాను రక్షించుకుంది. ఎదుటి వ్యక్తికి తనకన్నా ఎక్కువ శక్తి ఉందని తెలిసినా... భయపడకుండా అతనిని ఎదురించింది.తన శక్తిని మంచి పోరాడింది. అతను ఆమెను బంధించడానికి ప్రయత్నించినా.... ఆమెపై అత్యాచారం చేయాలని గట్టిగా ప్రయత్నించినా... ఆమె ఏ మాత్రం తలొగ్గకుండా ధైర్యంగా పోరాడింది. ఆమె పోరాటం ముందు దుండగుడు ఓడిపోయాడు. కాగా.... ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. కాగా... ఆమె అతనిపై దాడి చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.