మ‌య‌న్మార్ లీడ‌ర్ ఆంగ్ సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు శిక్ష

By team telugu  |  First Published Dec 6, 2021, 2:12 PM IST

మ‌య‌న్మార్ లీడ‌ర్‌, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఆ దేశ అత్యున్న‌త‌ న్యాయ‌స్థానం  సోమ‌వారం నాడు నాలుగు సంత్స‌రాల జైలు శిక్ష విధించింది. సూకీపై అవినీతి, అధికారిక రహస్య చట్టం, టెలికాం చట్టం, క‌రోనా వైర‌స్  నిబంధనలను ఉల్లంఘించడం  వంటి 11 అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఈ నేప‌థ్యంలోనే కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. 


మయన్మార్ లీడ‌ర్‌,  ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఆ దేశ న్యాయ‌స్థానం నాలుగు సంవ‌త్స‌రాల  జైలు శిక్ష విధించింది. ఆంగ్‌సాన్ సూకీపై అవినీతి పాల్ప‌డ‌టం, అధికారిక రహస్య చట్టం, టెలికాం చట్టం,  నిబంధనలను ఉల్లంఘించడం వంటి ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటితో పాటు మొత్తం 11 అభియోగాలు ఆమెపై నమోదు చేయబడ్డాయి. దీనికి గానూ  ఆమెకు నాలుగేండ్ల శిక్ష‌ను విధిస్త‌న్న‌ట్టు ఆ దేశ కోర్టు వెల్ల‌డించింది.  ఆమెను ప‌ద‌వినుంచి తొల‌గించబ‌డిన త‌ర్వాత ప‌లు కేసుల‌తో అరెస్టు అయ్యారు. ఈ కేసులు విచార‌ణ పూర్త‌యింది. ఇదివ‌ర‌కే తీర్పులు రావాల్సి వుండ‌గా.. న్యాయ‌స్థానం వాయిదా వేసింది.  అదనపు సాక్షుల నుండి సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు అనుమతించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. సోమ‌వారం నాడు తీర్పును వెలువ‌రిస్తూ ఆంగ్‌సాన్ సూకీకి నాలుగేండ్లు జైలు శిక్ష‌ను విధించింది. 

Also Read: వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనత .. ఇదే వేగాన్ని కొనసాగిద్దాం: ప్రధాని మోడీ

Latest Videos

undefined

ఇప్ప‌టికీ ఆంగ్‌సాన్ సూకీపై మోప‌బ‌డిన అభియోగాల‌కు సంబంధించి నాలుగేండ్ల శిక్ష ప‌డింది. కానీ ఇప్ప‌టికీ ఆమెపై మ‌రిన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు రుజువైతే గ‌న‌క ఆమెకు జీవిత ఖైదు విధించే అవ‌కాశాలున్నాయ‌ని అక్క‌డి మ‌య‌న్మార్ న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.  ప్ర‌స్తుతం ఆంగ్‌సాన్ సూకీకి విధించిన శిక్ష‌కు సంబంధించిన అభియోగాలు గ‌మ‌నిస్తే... 2020 సంత్స‌రంలో ఎన్నిక‌ల నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా ఉల్లంఘించ‌డం, అధికారిక ర‌హ‌స్య చ‌ట్టాల ఉల్లంఘ‌న‌లు ప్ర‌ధానంగా ఉన్నాయి. వీటితో పాటు లైసెన్స్ లేని వాకీ టాకీలు ఉపయోగించడం, సిగ్నల్ జామర్స్ అనుమతి లేకుండా వాడటం వంటి అభియోగాలు సైతం ఆమెపై మోప‌బ‌డ్డాయి.  దీనికి తోడు మ‌య‌న్మార్‌లో ప్ర‌భుత్వాన్ని అక్క‌డి సైన్యం త‌మ చేతుల్లోకి తీసుకున్న త‌ర్వాత ఆంగ్‌సాన్ సూకీపై మ‌రిన్ని ఆరోప‌ణ‌లు మోప‌బ‌డ్డాయి. వాటిలో ఎలక్టోరల్ మోసం, దేశద్రోహం, బ్రిటీష్ కాలం నాటి రహస్య చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలున్నాయి.  అలాగే, సూకీ అధికారంలో ఉన్న‌ప్పుడు అక్ర‌మంగా 11 కిలోల బంగారాన్ని, 6 లక్షల డాలర్లను పొందారని యాంగోన్ రీజియన్ చీఫ్ మినిస్టర్ ఆరోపించారు.

Also Read: నాగాలాండ్‌ ఘటనపై నేడు పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన

కాగా, ఆంగ్‌సాన్ సూకీ దేశంలో ప్ర‌జాస్వామ్యం కోసం పోరాడుతూ.. 1989 అరెస్ట‌య్యారు.  1989 నుంచి 2012 వ‌ర‌కు.. దాదాపు 15 ఏండ్ల పాటు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఆమె చేస్తున్న ప్ర‌జాస్వామ్య పోరాటానికి 1991లో నోబెల్ బ‌హుమ‌తి కూడా ల‌భించింది.  అయితే, సూకీ నేతృత్వంలో ఎన్ఎల్డీ పార్టీ 2015లో విజయం సాధించింది.  అయితే, 2017లో రోహింగ్యాల సంక్షోభంతో ఆమెకు స‌మ‌స్య‌లు మొదల‌య్యాయి. అప్ప‌టి నుంచి ఆమెను వివాదాలు వెంటాడుతున్నాయి.  ఇక 2020లో జ‌రిగిన మ‌య‌న్మార్ ఎన్నిక‌ల్లో అంగ్ సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్.ఎల్.డీ) పార్టీ ప్రతినిధుల సభలో 258 సీట్లు, హౌస్ ఆఫ్ నేషనాలిటీస్‌లో 138 సీట్లు గెలుచుకుంది.  సైన్యం మద్దతు ప్రకటించిన యూనియన్ సాలిడారిటీ డెవలప్‌మెంటు పార్టీ (యూ.ఎస్.డీ.పీ) ఓడి పోయింది.  ఆంగ్‌సాన్ సూకీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి.. రాజ్యాంగాన్ని స‌వ‌రించాల‌నుకుంటున్న క్ర‌మంలో సైనిక తిరుగుబాలు మొద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 1న సైనికులు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ‌టం స‌హా మ‌రిన్ని అభియోగాల‌తో ఆంగ్ సాన్ సూకీని నిర్భంధంలోకి తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఆ దేశం ప్ర‌జా నిర‌స‌న‌ల‌తో ర‌గిలిపోతోంది. ఇప్ప‌టికే నిర‌స‌న‌ల్లో వేల మంది పౌరులు చనిపోయారు. 

Also Read: భారత్‌-రష్యా మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు.. కీల‌క ఒప్పందాల‌పై సంత‌కాలు

click me!