అలస్కా రాష్ట్రాన్ని అమెరికాకు రష్యా ఎందుకు అమ్మింది?

By Pratap Reddy KasulaFirst Published Dec 5, 2021, 7:14 PM IST
Highlights

రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచంలో అమెరికా, రష్యాలను రెండు వేరు ధ్రువాలుగా చూసేవారు. ఆ రెండింటికీ మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గమంటుంది అన్నట్టుగా ఉండేది వ్యవహారం. అలాంటి అమెరికాకు రష్యా తనలో అంతర్భాగంగా ఉన్న అలస్కాను అమ్మడం..అదీ చౌకగా అమ్మేయడం ఇప్పుడు ఆలోచిస్తే గందరగోళంగానే ఉంటుంది. అయితే, అలస్కాను అమ్మడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అమెరికా, రష్యా దేశాల మధ్య కోల్డ్ వార్‌కు కనీసం ఓ వంద సంవత్సరాల ముందు ఆ రెండూ మిత్రదేశాలుగా ఉండేవి. బ్రిటన్, ఫ్రాన్స్‌లపై వ్యతిరేకతే వాటి స్నేహానికి భూమికగా ఉండేది. 
 

న్యూఢిల్లీ: Americaలో 50 రాష్ట్రాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికాలో చేరిన చివరి రాష్ట్రం హవాయ్, 49వ రాష్ట్రం Alaska. అమెరికాలో 49వ రాష్ట్రంగా చేరిన అలస్కా 1867 సంవత్సరానికి ముందు Russia అంతర్భాగంగా ఉండేది. అంటే 154 సంవత్సరాల క్రితం రష్యానే స్వయంగా అలస్కాను అమెరికాకు అమ్ముకుంది. అది కూడా చాలా చౌకగా అమెరికా చేతిలో పెట్టింది. అప్పుడు 70.2 లక్షల డాలర్లు అమ్మింది. ఇప్పుడు ఆ దేశ జీడీపీనే 5000 కోట్ల డాలర్లు. సహజ వనరులు అలస్కాలో సమృద్ధిగా ఉంటాయి. అంతటి సంపద గల అలస్కాను రష్యా.. అమెరికాకు అమ్ముకోవాల్సిన అగత్యం ఏం వచ్చింది? కారణాలేమిటి? అంటే.. కొన్ని ఆసక్తికర విషయాలను చూడాల్సిందే.

రష్యా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం. కానీ, దాని చరిత్రలోకి తొంగి చూస్తే.. 16వ శతాబ్దంలో అది ఇప్పుడున్న దేశంలో ఒక చిన్న ముక్క. అంటే అది చాలా చిన్న దేశం. కానీ, అప్పటి చక్రవర్తులు రష్యా విస్తరణపై విపరీత ఆసక్తి చూపించారు. ముఖ్యంగా తూర్పు వైపున వారి ఆక్రమణ వేగంగా సాగింది. ఈ ఆక్రమణ ఏకంగా బేరింగ్ జలసంధిని దాటి ఇప్పటి ఉత్తర అమెరికా ఖండంలోని అలస్కా ప్రాంతాన్నీ సొంతం చేసుకునే వరకు సాగింది. నిజానికి అలస్కా ఇప్పుడు ఉన్నంత రమణీయ ప్రదేశమేమీ కాదు. కఠిన వాతావరణంతో జీవించడానికి ఎంతమాత్రం ఉపయుక్తం కాని ప్రదేశంగా ఉండేది.

Also Read: 6న భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. పది కీలక ఒప్పందాలపై సంతకాలు

రష్యా చక్రవర్తులకు దాని విస్తరణపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. 1741లో విటస్ బేరింగ్.. అమెరికా, రష్యాలను విడగొట్టే బేరింగ్ జలసంధిని దాటారు. అలస్కా చేరుకున్నారు. అక్కడి నుంచి మౌంట్ సెయింగ్ ఎలియాస్, యకుటాట్‌లకూ చేరుకున్నారు. కానీ, అదే ఏడాది డిసెంబర్‌లో ఆయన మరణించారు. అప్పటి నుంచి అలస్కా రష్యాలో భాగంగానే ఉండిపోయింది. కానీ, కఠిన వాతావరణం చేత అలస్కాలో చాలా తక్కువ జనాభా అంటే వేయికి అటు ఇటుగా సంఖ్య ఉండేది. 

కానీ, రాజ్యాలు అంతమై ప్రభుత్వాలు ఏర్పాడ్డక రష్యా దేశ అప్పటి రాజధాని పీటర్స్‌బర్గ్‌కు అలస్కా చాలా దూరం. ఈ ఇంటర్‌కాంటినెంటల్ కంట్రీ(రష్యా దేశం ఐరోపా, ఆసియా ఖండాలు రెండింటిలోనూ ఉంటుంది) రష్యాకు చెందిన ఉత్తర అమెరికా ఖండంలోని అలస్కాలోని ప్రజల కోసం 1812లో నిర్మాణాలు చేపట్టింది. అప్పుడు అక్కడ సుమారు 800 మంది పౌరులు ఉండి ఉంటారు. అయితే, చాన్నాళ్ల నుంచి అలస్కా పౌరుల బాగోగులు రష్యా దేశానికి ఒక ఆందోళనగానే కొనసాగుతూ వచ్చింది. క్రిమియన్ యుద్ధం(1853-1856) తర్వాత అది మరింత సంక్లిష్టంగా మారింది.

Also Read: పాశ్చాత్య దేశాలకు రష్యాకు మధ్య యుద్ధం జరగవచ్చు.. బ్రిటన్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలు

రష్యా దేశం బాల్కన్ దేశాలైన బల్గేరియా, రొమేనియా, మొల్డోవా, క్రిమియా వంటి దేశాలను తనలో కలుపుకోవాలని ఆశించింది. కానీ, అవి 1850లనాటి ఒట్టోమన్ ఎంపైర్‌లో ఉన్నాయి. ఒట్టోమన్ సామ్రాజ్యంలోని క్రైస్తవుల రక్షించాలని రష్యా భావించింది. 1853 జులైలో రష్యా రొమేనియాను ఆక్రమించింది. దీంతో టర్కీ రష్యాపై యుద్ధాన్ని ప్రకటించింది. నల్లసముద్రంలో రష్యా నౌకలపై గుర్రుగా ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్‌లూ టర్కీ పక్కన నిలుచున్నాయి. కానీ, ఈ యుద్ధంలో భంగపడ్డ రష్యా ఆర్థికంగా చితికిపోయింది. ఖజానా ఖాళీ కావడంతోపాటు సుమారు 12వేల మంది ప్రాణ నష్టాన్ని రష్యా చవిచూసింది. ఆ సమయంలోనే అమెరికా దేశాన్ని చేరి అలస్కా అమ్మకానికి బేరం పెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్‌లపట్ల విముఖత చూపిన అమెరికానూ తన సన్నిహిత దేశంగా రష్యా ఎంచింది. అమెరికాకు పశ్చిమ తీరంలో ఉన్న అలస్కా ఆ దేశానికీ విడివడినట్టుగానే ఉంటుంది. మధ్యలో కెనడా దేశ సరిహద్దుల మూలంగా అలస్కా అమెరికాతో భౌగోళికంగా విడివడినట్టుగా కనిపిస్తుంది.

click me!