ఏప్రిల్ 2న భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:15 గంటలకు మయన్మార్‌లో 4.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. దీని కేంద్రం 20.70°N అక్షాంశం, 96.06°E రేఖాంశంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉంది. మార్చి 28న సంభవించిన భారీ 7.0 తీవ్రత గల భూకంపం ప్రాంతాన్ని కుదిపేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకంపనలు సంభవించాయి..
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, బుధవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 4.3 తీవ్రతతో తాజా భూకంపం సంభవించింది. మయన్మార్‌లో వారం రోజుల్లో ఇది మూడవ భూకంపం.
ఈ ప్రకంపన IST 16:15 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది, దీని యొక్క కేంద్రం 20.70°N అక్షాంశం, 96.06°E రేఖాంశంలో ఉంది.
శనివారం, మార్చి 29న, రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం మయన్మార్‌ను కుదిపేసింది - మార్చి 28న 7.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం ప్రాంతంలో, పొరుగున ఉన్న థాయిలాండ్, బ్యాంకాక్ లలో భూంకంపం విధ్వంసం సృష్టించిన తర్వాత రోజే ఈ సంఘటన జరిగింది.
మార్చి 28న మయన్మార్‌ను కుదిపేసిన వినాశకరమైన 7.7 తీవ్రత గల భూకంపం తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే తాజాగా మరోసారి భూమి కంపించింది. నివేదికల ప్రకారం, మరణాల సంఖ్య ఇప్పుడు 2,000 దాటింది. సంక్షోభానికి ప్రతిస్పందనగా భారతదేశం మయన్మార్ కు సహకారం అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. శనివారం నుంచి భారతదేశం ఆరు విమానాలు, ఐదు నౌకాదళ నౌకలను సమీకరించింది, 625 మెట్రిక్ టన్నుల సామాగ్రిని పంపిణీ చేసింది.
EQ of M: 4.3, On: 02/04/2025 16:15:06 IST, Lat: 20.70 N, Long: 96.06 E, Depth: 10 Km, Location: Myanmar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs pic.twitter.com/Ea14L4I96l
పెరుగుతోన్న మృతుల సంఖ్య
ఇదిలా ఉంటే మయన్మార్‌లో జరిగిన భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 2,719 మంది మృతి చెందారు. వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారు. 4,521 మంది గాయపడగా.. 441 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రహదారులు ధ్వంసంకావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.