
న్యూఢిల్లీ: ఉత్తర ఆఫ్రికా దేశం Libya అధ్యక్ష పదవికి వచ్చే నెల 24న Elections జరగనున్నాయి. లిబియాను 40ఏళ్లు పాలించి.. పాలించిన వారి చేతుల్లో హతమైన పాలకుడు Muammar Gaddafi తనయుడు సైఫ్ అల్ ఇస్లాం అల్ గడాఫీ ఈ President ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఆదివారం ప్రకటించారు. సైఫ్ అల్ ఇస్లాం అల్ గడాఫీ ఎన్నికల్లో పోటీ చేయడానికి డాక్యుమెంట్లపై సంతకం పెట్టినట్టు అధికారిక ధ్రువీకరణ వచ్చింది.
ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నవారుల్లో సైఫ్ అల్ ఇస్లాం అల్ గడాఫీ కూడా ప్రముఖంగా ఉన్నారు. ఈయనతోపాటు ఈస్ట్రన్ మిలిటరీ కమాండర్ ఖలీఫా హఫ్తార్, ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దెయిబా, పార్లమెంట్ స్పీకర్ అగిల్లా సలేహ్‌లూ పోటీలో ఉన్నారు.
Also Read: గడాఫీతో కత్రీనా కైఫ్- పదిహేనేళ్ల క్రితమే.. ఫోటో లీక్-వైరల్
అయితే, అధ్యక్ష ఎన్నికలపైనే ఇంకా స్పష్టత కనిపించడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఇంకా అల్లర్లు సద్దుమణగలేదు. దేశంలోనే ప్రభుత్వ తిరుగుబాటుదారులు, విదేశీ బలగాలు, చట్టబద్ధ పాలన లోపించడం వంటివి ఎన్నికల నిర్వహణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే, ఎన్నికలను అడ్డుకునే వారు ఎవరైనా ఆంక్షలు విధించే తీరుతామని ప్యారిస్ 2లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో నిర్ణయం జరిగింది. మరో ఆరువారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఇంకా ఎన్నికల నిర్వహణ తీరు, నిబంధనలు, పాలకుల అధికారాల వంటి వాటిపై స్పష్టత లేదు.
కాగా, గడాఫీ తన తండ్రి నాటి పాలనపై ప్రజల్లో కొంత ఆశ కలిగించవచ్చు.. కానీ, సైఫ్ అల్ ఇస్లాం అల్ గడాఫీ అంత ప్రముఖమైన అభ్యర్థిగా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ముమ్మార్ గడాఫీని చంపేసిన తర్వాత సైఫ్ అల్ ఇస్లాం అల్ గడాఫీని బంధించారు. నిర్బంధం నుంచి విడుదలయ్యాక క్రియా శీలక రాజకీయాల్లో ఆయన ఎక్కువ పాల్గొనలేదు. అందుకే ఆయనకు మెజార్టీ ప్రజల మద్దతు కూడగట్టడం కత్తిమీద సవాలే.
Also Read: సులేమానీ హత్యకు ప్రతీకారం: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి
2011లో నాటో బలగాలు మద్దతున్న కొన్ని శక్తులు దేశంలో తిరుగుబాటును లేవదీసినట్టు చెబుతారు. అయితే, ముమ్మార్ గడాఫీ ఏకఛత్రాధిపత్యంపైనా వ్యతిరేకత ఉన్నది. ఇవన్నీ కలిసి దేశంలో పెద్ద తిరుగుబాటుకు కారణమయ్యాయి. గడాఫీ పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ, కొందరు ఆయనను పట్టుకుని కొట్టి చంపేశారు.
గడాఫీకి ఎనిమిది మంది పిల్లలు. ఆయన పాలనలో వీరికి కొంత అధికారం ఉండేది. ఆయన కొడుకు మౌతాస్సిమ్‌ను గడాఫీని పట్టుకున్న సమయంలోనే చంపేశారు. మరో ఇద్దరు కుమారుడు సైఫ్ అల్ అరబ్, ఖామిస్‌లనూ తిరుగుబాటు తొలినాళ్లలోనే హతమార్చారు. మరో కొడుకు అల్ సాది గడాఫీ ఏడేళ్ల నిర్బంధం తర్వాత విడుదలయ్యాడు.