జైలులో గ్యాంగ్ వార్.. 68 మంది మృతి.. డ్రగ్స్ రవాణాపై ఆధిపత్యం కోసం ఘర్షణలు!

By telugu teamFirst Published Nov 14, 2021, 7:29 PM IST
Highlights

అంతర్జాతీయంగా డ్రగ్స్ అక్రమ రవాణా కోసం ఆధిపత్య పోరులో భాగంగా ఈక్వెడార్‌లోని జైలులో గ్యాంగ్ వార్ బద్ధలైంది. ఈ ఘర్షణల్లో కనీసం 68 మంది ఖైదీలు మరణించారు. మరో 25 మంది గాయపడినట్టు తెలిసింది. పేలుడు పదార్థాలు, కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున మొదలైన ఘర్షణలు సుమారు ఎనిమిది గంటలపాటు జరిగాయి. ఘర్షణలను అదుపులోకి తేవడానికి 900 మంది పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

న్యూఢిల్లీ: దక్షిణ అమెరికా దేశం Ecuadorలోని అతిపెద్ద Prisonలో Gang Warలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణలు జరిగాయి. కత్తులు, పేలుడు పదార్థాలతో ఒక గ్యాంగ్‌పై మరో గ్యాంగ్ దాడులు చేసుకున్నాయి. పెవిలియన్ 2లో ఉన్న ఖైదీలను ఊపిరాడకుండా చేసి చంపడానికి మ్యాట్‌లను కాల్చారు. ఈ ఘటనలో కనీసం 68 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలను అదుపులోకి తేవడానికి 900 మంది పోలీసు అధికారులు తీవ్రంగా శ్రమించారని అధికార పక్షం తెలిపింది. అంతర్జాతీయ Drugs అక్రమ రవాణాపై ఆధిపత్యం కోసమే ఈ గ్యాంగ్ వార్ జరిగినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. ఎదుటి గ్యాంగ్‌పై పై చేయి సాధించాలనే లక్ష్యంతోనే హింసాత్మక ఘర్షణలకు పాల్పడినట్టు తెలిసింది. సెప్టెంబర్‌లోనూ జైలులో గ్యాంగ్ వార్ జరిగిన 119 మంది ఖైదీలు దుర్మరణం చెందారు.

ఈక్వెడార్‌ తీర నగరం గయాక్విల్‌లోని దేశంలోనే అతిపెద్ద కారాగారం లిటోరల్ పెనిటెన్షియరీలో ఈ దారుణం జరిగింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణ జరిగిందని దేశ అధికారులు కొందరు చెప్పారు. ఉదయం ప్రారంభమైన ఈ దాడులు కనీసం 8 గంటల పాటు జరిగినట్టు తెలిపారు.

Also Read: స్మగ్లర్ల ఘాతుకం.. 14 అడుగుల గోడమీది నుంచి చిన్నారులను ఎడారిలోకి విసిరేసి... !

ఘర్షణల ప్రారంభంలో డైనమైట్ ద్వారా గోడను కూల్చి పెవిలియన్ 2లోని ఖైదీలందరినీ ఊచకోత కోయాలనే ప్రయత్నాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. పొగతో ఊపిరి ఆడనివ్వకుండా చంపేయాలనే ప్లాన్ కూడా అమలు చేసినట్టు గయాస్ ప్రావిన్స్ గవర్నర్ పాబ్లో అరొసెమెనా వివరించారు. తాము డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఇది చాలా కష్టమైన పోరాటామని తెలిపారు.

జైలుకు సరుకులను తెచ్చే వాహనాల ద్వారానే ఆయుధాలను ఖైదీలు సమకూర్చుకున్నట్టు తెలుస్తున్నదని అధికారులు తెలిపారు. కొన్ని సార్లు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు జైలుకు చేరి ఉంటాయని వివరించారు. ఘర్షణలు జరిగిన జైలు పెవిలియన్‌లపై డ్రోన్‌లు ఎగురుతూ కనిపించాయని పోలీసు కమాండర్ జనరల్ తాన్యా వరేలా వెల్లడించారు.

Also Read: గుజరాత్ డ్రగ్స్ కేసు: 8 మంది అరెస్ట్.. నిందితుల్లో ముగ్గురు భారతీయులు

సెప్టెంబర్‌లో జైలులో ఇలాంటి గ్యాంగ్ వార్ వల్లే 119 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చాలా మంది జైలు ముందు చేరి తమ ఆప్తులు ఎలా ఉన్నారో? అనే ఆందోళనలో మునిగిపోయారు. దేశాధ్యక్షుడు గిలెర్మో లాసోపై మండిపడ్డారు. ఈ ఘటన తర్వాతే దేశవ్యాప్తంగా 60 రోజుల ఎమర్జెన్సీ విధించారు. ఈ సమయంలో జైలులోనూ ఖైదీలకు రక్షణ ఇవ్వడానికి మిలిటరీని దింపాలనే నిర్ణయం చేశారు. కానీ, కాన్‌స్టిట్యూషనల్ కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దీంతో తాజా ఘర్షణలు జరిగినప్పుడూ మిలిటరీ జైలు బయటే ఉండిపోవాల్సి వచ్చింది.

click me!