
ఖలిస్తానీ అనుకూల శక్తుల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని తొలగించిన ఘటన మరవక ముందే.. కెనడాలో మరో ఘటన చోటు చేసుకుంది. కెనడాలోని ఒంటారియోలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కాంగ్రెస్ రియాక్షన్.. ‘ఆ అధికారం లోక్‌సభ సెక్రెటేరియట్‌కు ఉండదు’
భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆరడుగుల కాంస్య విగ్రహానికి రంగులు వేసి 2012లో అక్కడ ప్రతిష్టించారు. అయితే ఆ విగ్రహంపై దుండగులు గాంధీని దూషిస్తూ, ప్రధాని మోడీని విమర్శిస్తూ విగ్రహం అడుగు భాగంలో గ్రాఫిటీని స్ప్రే చేశారు. విగ్రహానికి ఖలిస్తాన్ జెండాను కూడా జత చేశారు.
దర్వాప్తు సంస్థల దుర్వినియోగం.. ఏప్రిల్ 5న సుప్రీంకోర్టు విచారణ
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖలిస్తానీ మద్దతుదారుల నిరసనలు ప్రభుత్వానికి తెలుసునని కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో ఈ సంఘటన జరిగింది. నిరసనలకు సంబంధించి కెనడా అధికారులు భారత దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మార్లిన్ గువ్రేమోంట్ తెలిపారు.
కెనడాలో భారత, హిందూ వ్యతిరేక చర్యలు ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు అక్కడ ఉన్న హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిర్ ను ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. దాని గోడలపై భారతదేశ వ్యతిరేక నినాదాలు రాశారు. అలాగే ఫిబ్రవరిలో కెనడాలోని మిస్సిసాగాలోని ప్రముఖ రామమందిరం ఖలిస్థాన్ అనుకూల గ్రూపులు ధ్వసం చేశాయి. ఆ సమయంలో కూడా గ్రాఫిటీతో భారత వ్యతిరేక నినాదాలు రాశారు. 2022 జూలైలో గ్రేటర్ టొరంటో ఏరియాలోని విష్ణు మందిర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు.. సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ రోజు నుంచే..!
కాగా.. వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్‌పై పోలీసుల అణిచివేతకు నిరసనగా ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ వారం ప్రారంభంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి చేశారు. ఖలిస్తానీ నినాదాలు చేస్తూ.. నిరసనకారులు నగర పోలీసులు ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా అడ్డంకులను తెరిచి, కాన్సులేట్ ప్రాంగణంలో రెండు ఖలిస్తానీ జెండాలను ఆవిష్కరించారు. అంతటితో ఆగకుండా నిరసనకారులు ఇనుప రాడ్లతో తలుపులు, కిటికీలను కొట్టి కాన్సులేట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు.