ఇదెక్కడి భార్య రా బాబు...లాటరీ దొరకగానే భర్తనే వదిలేసింది..!

Published : Mar 23, 2023, 09:20 AM ISTUpdated : Mar 23, 2023, 12:40 PM IST
ఇదెక్కడి భార్య రా బాబు...లాటరీ దొరకగానే భర్తనే వదిలేసింది..!

సారాంశం

లాటరీ రాగానే కట్టుకున్న భర్తనే వదిలేసింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా మరో ప్రదేశానికి చెక్కేసింది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈమధ్యకాలంలో మీరు వినే ఉంటారు.. చాలా మంది లాటరీల్లో డబ్బు గెలవడం గురించి. చాలా మంది పేదవాళ్లు...లాటరీ తగిలి కోటీశ్వరులయ్యారు. వారు అలా రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారగానే...తమ కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవడం లాంటివి చేస్తారు. ఎవరైనా లాటరీలో డబ్బు వస్తే.... కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనే అనుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం భిన్నంగా ప్రవర్తించింది. లాటరీ రాగానే కట్టుకున్న భర్తనే వదిలేసింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా మరో ప్రదేశానికి చెక్కేసింది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

థాయిలాండ్ కి చెందిన నారీన్ అనే వ్యక్తికి పెళ్లై చాలా కాలం అవుతోంది. భార్య చావీవాన్, పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేవాడు. కుటుంబం కోసం అతను చాలా అప్పులు చేశాడు. ఆ అప్పులు ఎక్కువ కావడంతో... వాటిని తీర్చడానికి దక్షిణ కొరియా వెళ్లి అక్కడ పని చేయాలని అనుకున్నాడు. 2014లో కుటుంబంతో కలిసి దక్షిణ కొరియా వెళ్లిపోయాడు.

అయితే.... కొంతకాలం తర్వాత.. నారీన్ దక్షిణకొరియాలోనే ఉండిపోగా.. అతని భార్య చావీవాన్ మాత్రం పిల్లలతో కలసి మళ్లీ థాయిలాండ్ వెళ్లిపోయింది. అయితే... ఆమె ఇటీవల ఓ లాటరీ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.2.9 కోట్ల రూపాయలు గెలుచుకుంది. అయితే ఆ విషయాన్ని మాత్రం భర్తకు చెప్పలేదు.

ఎవరికీ చెప్పకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసేసుకుంది. ఈ విషయం తెలియని నారీన్ భార్య ఫోన్ కలవడం లేదని కంగారుపడ్డాడు. వెంటనే విషయం తెలుసుకునేందుకు థాయిలాండ్ వచ్చిన అతను... అసలు విషయం తెలిసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తుకొనసాగుతోంది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?
Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?