Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల నమోదులో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అన్ని దేశాల్లో కలిపి 25 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి.
Coronavirus: 2019లో చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి అతి తక్కువ కాలంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఇప్పటికీ తన ప్రభావాన్ని పెంచుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. అనేక మ్యూటేషన్లకు గురై మానవాళికి మనుగడకు సవాలు విసురుతోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో Coronavirus రోజువారీ కేసుల్లో కొత్త రికార్డు నమోదవుతున్నాయి. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 25 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారంటే వైరస్ ఉధృతి ఏ స్థాయిలో కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో Coronavirus కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
శుక్రవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 25,19,837 మందికి వైరస్ సోకింది. 7,214 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో సుమారు 6.89 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 303,897,260 Coronavirus కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,497,851 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 258,344,207కు చేరింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 90 శాతానికి పైగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు Coronavirus కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా,టర్కీ, జర్మన, స్పెయిన్, ఇటలీ, ఇరాన్, అర్జెంటీనా దేశాలు టాప్ లో ఉన్నాయి.
undefined
ప్రస్తుతం భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు యూరప్ దేశాల్లో Coronavirus ఉధృతి అధికంగా ఉంది. ఆయా దేశాల్లో కరోనా బారినపడుతున్న రోజువారీ సంఖ్యలు కొత్త రికార్డులు నమోదుచేస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతున్నది. దీనికి తోడు ఫ్రాన్స్ తో మరో కొత్త వేరియంట్ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఇది డెల్టా, ఒమిక్రాన్ నేపథ్యంలోనే పుట్టుకొచ్చిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇక ఫ్రాన్స్ లో ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 2, 61, 481 కేసులు బయటపడ్డాయి. 204 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం Coronavirus కేసులు 1,11 83, 238కి చేరాయి. వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 1, 25, 013కి చేరింది. ఇటలీలోనూ కొత్తగా 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 198 మంది ప్రాణాలు కోల్పోయారు. 46వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 69, 75, 465కు చేరింది. మొత్తం 1,14, 207 మంది Coronavirus తో మరణించారు.
బ్రిటన్‌లో అయితే, కరోనా పంజా విసురుతోంది. డెల్టా తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇందులో వైద్యారోగ్య సిబ్బంది సైతం అధికంగా ఉంటున్నారు. దీని కారణంగా అక్కడ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే రోగులతో ఆస్పత్రులు నిండిపోయాయని సమాచారం. బ్రిటన్‌లో ఒక్కరోజే 1.79 లక్షల మంది Coronavirus బారినపన పడటం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. దీంతో బ్రిటన్ లో కరోనా వైరస్ మొత్తం కేసులు 14,193,228కి పెరిగాయి. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 149,744 చేరింది. అర్జెంటీనాలోనూ రోజువారీ కొత్త కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో దాదాపు లక్షన్నర కొత్త Coronavirus కేసులు వెలుగుచూశాయి.