చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదు..మూడువేలమంది మృతి... !

By SumaBala BukkaFirst Published Jan 8, 2022, 12:34 PM IST
Highlights

చైనా లోని కింగ్‌ హై ప్రావిన్స్‌లోని మెన్యువాక్ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల  ఉత్తర  అక్షాంశం, 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్ హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం..  బీజింగ్ టైం ప్రకారం శనివారం తెల్లవారుజామున అంటే 01:45 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 

చైనా : ఈ మధ్యకాలంలో earthquake భారీగా చోటుచేసుకుంటున్నాయి. మన దేశంలో సంభవించే భూకంపాలు పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు. కానీ ఇతర దేశాలలో సంభవించే భూకంపాలతో భారీ నష్టం సంభవిస్తుంటుంది. ఇక తాజాగా Chinaలోని కింగ్ హై ప్రావిన్స్‌లో Massive earthquake సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

కింగ్‌ హై ప్రావిన్స్‌లోని మెన్యువాక్ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల  ఉత్తర  అక్షాంశం, 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్ హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. Beijing టైం ప్రకారం శనివారం తెల్లవారుజామున అంటే 01:45 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 

ప్రావిన్షియల్ రాజధాని జినింగ్ సిటీలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రకంపనలు అధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం రాగానే అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జంతువులు సైతం పరుగులు తీశాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. కాగా, 2010 లో కూడా అక్కడ ఇలాగే భారీ భూకంపం సంభవించింది.  

అయితే ఈ రోజు 6.9 భూకంప తీవ్రతతో  భూప్రకంపనలు రావడం వల్ల సుమారు మూడు వేలమంది వరకు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, 2022 జనవరి ఫస్ట్ రోజే భారత్ లోని కాశ్మీర్ లో భూకంపం పలకరించింది. కొత్త ఏడాది తొలి రోజే .. జమ్ముకాశ్మీర్​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శనివారం సాయంత్రం 6:45 గంటల  స‌మయంలో కశ్మీర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. అఫ్గానిస్థాన్​- తజికిస్థాన్​ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్ములోనూ ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించ‌డంతో జనాలు భ‌యాందోళ‌నకు గుర‌య్యారు . ప‌లు ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించ‌డంతో జనాలు ఇళ్లు వదిలి రోడ్లపైకి, మైదాన ప్రాంతాల‌కు పరుగులు తీశారు.

భూమి పొరల నుంచి శబ్దాలు వినపడంతో జనాలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ భూప్రకంపనల నేపథ్యంలో కొన్ని ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయాయి. గోడలకు పగుళ్లు రావడమే కాకుండా బీటలు వారుతున్నాయి. ఈ క్రమంలోనే జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.గ‌త నాలుగు రోజుల కిత్రం కూడా జమ్మూ కాశ్మీర్‌లో భూమి కంపించింది. దీని తీవ్ర‌త  5.3 గా న‌మోదు అయ్యింది. 

కాగా, జనవరి 5న Telangana రాష్ట్రంలోని Vikarabad, Sanga Reddy జిల్లాలో బుధవారం నాడు మధ్యాహ్నం స్వల్పంగా Earth quake దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. వికారాబాద్ జిల్లాలోని దమస్తాపూర్, భుచ్చన్‌పల్లి, మర్పల్లి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు చెప్పారు. భూమి కింది భాగంలో కదలిక రావడంతో పొలాల్లో పనిచేస్తున్న రైతులు భయాందోళనలు వ్యక్తం చేశారు.ఈ విషయమై భూగర్భశాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

click me!