డేటింగ్ యాప్ లో పరిచయం.. కలవాలని పిలిచి.. చంపి, ముక్కలుగా నరికి..!

By Ramya news teamFirst Published Jan 8, 2022, 9:44 AM IST
Highlights

శవాన్ని గుర్తుపట్టలేనట్లుగా..  చేసినందుకు కూడా.. దోషికి శిక్ష విధించడం గమనార్హం. కాగా.. దోషికి శిక్ష విధిస్తున్న క్రమంలో.. అతను.. చాలా మౌనంగా ఉన్నాడని అక్కడి మీడియా పేర్కొంది.

అతను ఓ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి.. పిల్లలకు మంచి, చెడు నేర్పించాల్సిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. డేటింగ్ యాప్ లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకొనున్నాడు. ఆ తర్వాత.. కలుద్దామని పిలిచి.. అతి దారుణంగా చంపేసి.. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఈ సంఘటన బెర్లిన్ లో చోటుచేసుకుంది. కాగా.. తాజాగా.. బెర్లిన్ న్యాయస్థానం.. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ కేసు పూర్వాపరాలు విన్న తర్వాత.. న్యాయస్థానం కూడా షాకైంది. తన 30ఏళ్ల సర్వీస్ లో.. ఇప్పటి వరకు.. ఇలాంటి కేసు తన ముందుకు రాలేదని న్యాయమూర్తి చెప్పడం గమనార్హం. చంపిన తర్వాత.. శవాన్ని గుర్తుపట్టలేనట్లుగా..  చేసినందుకు కూడా.. దోషికి శిక్ష విధించడం గమనార్హం. కాగా.. దోషికి శిక్ష విధిస్తున్న క్రమంలో.. అతను.. చాలా మౌనంగా ఉన్నాడని అక్కడి మీడియా పేర్కొంది.

ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం...  ఉపాధ్యాయుడు స్టెఫాన్ ఆర్(42).. కి డేటింగ్ యాప్ లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆన్ లైన్ లో వీరిద్దరూ కొంత కాలం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత.. తన ఇంటికి రావాలని బాధితుడిని స్టెఫాన్ కోరాడు. తన ఇంటికి వచ్చిన తర్వాత... సదరు వ్యక్తిని గొంతు కోసం స్టెఫాన్ చంపేయడం గమనార్హం.

ముందుగా.. అతనికి డ్రగ్స్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్న తర్వాత.. గొంతు కోసి చంపేశాడు. అనంతరం.. అతని జననాంగాలు కత్తిరించి తినేశాడు.. ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలను సైతం ముక్కలుగా కోసం.. బెర్లిన్‌లోని ఈశాన్య పాంకో జిల్లాలో చెల్లాచెదురుగా పడేశాడు.

అయితే.. స్థానికులు.. ఓ పార్కులు ఎముకలు ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ కేసు విషయం బయటకు వచ్చింది. 2020లో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

తప్పిపోయిన 43 ఏళ్ల బెర్లినర్ స్టెఫాన్ టి అవశేషాలుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి కాల్ రికార్డ్స్ ఆధారంగా.. నిందితుడిని గుర్తించారు.

బాధితుడు తన ఇంట్లోనే సహజ కారణాలతో చనిపోయాడని, తన స్వలింగ సంపర్కం గురించి ప్రజలు తెలుసుకుంటారనే భయంతో అతను మృతదేహాన్ని నరికి పారవేసాడని స్టీఫన్ ఆర్ కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే.. అతను చెప్పేదాంట్లో నిజం లేదని అనుమానించిన.. న్యాయస్థానం అతని వాదనను కొట్టిపారేసింది.

అతను నరమాంస భక్షకుడిగా గుర్తించారు. అతని శరీర భాగాల్లో జననాంగాలు కనిపించకపోవడాన్ని.. ఆ ప్రాంతాన్ని.. కరెక్ట్ గా కట్ చేయడాన్ని గుర్తించారు. వీటన్నింటినీ పరిశీలించి.. నిందితుడు స్టెఫిన్ ఆర్ ని దోషిగా గుర్తించారు. అతనికి జీవిత ఖైదు ఖరారు చేశారు. 
 

click me!