
ఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ గొడవపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ గొడవపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితిపై ఇద్దరూ చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలని భారత్ కోరుకుంటుందని మోదీ తెలిపారు.
ఇజ్రాయెల్-ఇరాన్ గొడవలో ఎవరి పక్షం వహించకుండా భారత్ స్పందించింది. రెండు దేశాలూ మన మిత్రులేనని విదేశాంగ శాఖ పేర్కొంది. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అణు కేంద్రాలపై దాడుల గురించి వస్తున్న వార్తలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఉద్రిక్తతలు పెంచే చర్యలు చేయొద్దని, చర్చల ద్వారా పరిష్కారం కోరాలని భారత్ సూచించింది. రెండు దేశాలతోనూ భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. సమస్య పరిష్కారానికి ఏ విధమైన సహాయానికైనా సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. ఇరాన్‌లోని భారతీయులు తాత్కాలికంగా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు స్థానిక అధికారుల హెచ్చరికలు పాటించాలని విదేశాంగ శాఖ సూచించింది.
ఇజ్రాయెల్ దాడులను టర్కీ ఖండించింది. ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని వినాశనం వైపు నెడుతోందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ విమర్శించారు. నెతన్యాహును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో టర్కీ స్పందన ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తోంది.