ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడి చేసి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ గజాలో ఆశ్రయం పొందుతోంది. అయితే ఆ గాజా సరిహద్దులను పూర్తిగా తాము స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా.. ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఇరు వైపులా 3 వేల మందకి పైగా మరణించారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నాయి. దీంతో ఇరు వైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. అయితే గాజాలో వైమానిక దాడులను కొనసాగిస్తూనే దాడిని మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన ఆకస్మిక అసాధారణ దాడి, దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు గాజాపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన ఎదురుదాడి, వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 3 వేల మంది మరణించారు.
బైక్ పై యువ జంట రొమాన్స్.. ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోతూ.. పోలీసులు ఏం చేశారంటే? (వీడియో)
undefined
కాగా.. గాజాకు సరిహద్దుగా ఉన్న దక్షిణ ఇజ్రాయెల్ ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. గాజాలోని ఖిజాన్-ఆన్-నజ్జర్ ప్రాంతంలోని హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ డీఫ్ తండ్రి ఇంటిని టార్గెట్ గా చేసుకొని ఇజ్రాయెల్ దళాలు రాత్రిపూట వైమానిక దాడులు జరిపినట్లు ‘ఇండియా టుడే’ నివేదించింది.
ఇంటి దగ్గర వదిలిపెడతానంటే బావ బైక్ ఎక్కిన మరదలు.. ఆమెతో మందు తాగించి, మరో నలుగురితో కలిసి...
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయిల్ సైన్యం అనేక ప్రాంతాలు, రహదారులను తన ఆధీనంలోకి తీసుకుంది. కాగా.. అమెరికా నుంచి 'అధునాతన' మందుగుండు సామగ్రితో మొదటి విమానం ఇజ్రాయెల్ లోని నెవాటిమ్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అయినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఈ మందుగుండు సామగ్రి గణనీయమైన దాడులు, ముందస్తు సన్నాహాలు చేయడానికి కోసం ఉద్దేశించబడిందని సైన్యం పేర్కొంది.
కాగా.. గోలన్ హైట్స్ ప్రాంతంలో రాకెట్లను ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం కూడా సిరియాలో కాల్పులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గాజాలో పౌరుల మరణాలు విపరీతంగా పెరగడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య యుద్ధం మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాల వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాల వైఫల్యానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ అని చాలా మంది తనతో ఏకీభవిస్తారని తాను భావిస్తున్నానని ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీతో పుతిన్ అన్నారు. పుతిన్ ఇరు పక్షాలతో మాట్లాడుతున్నారని, వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని మాస్కో అధికారులు పేర్కొన్నారు.
నిషేధిత పీఎఫ్‌ఐ లింకులు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు..
గాజాలోని 200కు పైగా లక్ష్యాలపై తమ యుద్ధ విమానాలు రాత్రికి రాత్రే దాడి చేశాయని, హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలతో సహా భవనాలను కూల్చివేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, 1,80,000 మందికి పైగా గాజాన్లు నిరాశ్రయులయ్యారు. చాలా మంది వీధుల్లో లేదా పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు.