ఆప్ఘనిస్తాన్ లో భారీ భూకంపం.. 6.3గా తీవ్రత నమోదు..

By SumaBala Bukka  |  First Published Oct 11, 2023, 7:34 AM IST

ఆప్ఘనిస్తాన్ లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయ్యింది. 


ఆఫ్ఘనిస్తాన్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. అక్టోబర్ 11న వాయువ్య ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు బుధవారం ఉదయం జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) తెలిపింది. భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉందని GFZ తెలిపింది.

అక్టోబరు 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన రెండు భూకంపాల వల్ల డజన్ల కొద్దీ ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం కారణంగా వేలాదిమంది మృత్యువాత పడ్డారని ఆ దేశ జాతీయ విపత్తు అధికార సంస్థ తెలిపింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన బలమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,000కు పెరిగిందని తాలిబాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Latest Videos

కాగా, జూన్ 2022లో, ఒక శక్తివంతమైన భూకంపం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం పర్వతప్రాంతంలోని నివాసాల్ని తుడిచిపెట్టింది. ఇది రెండు దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇది.. ఈ భూకంపంలో కనీసం 1,000 మంది మరణించారు. 1,500 మంది గాయపడ్డారు.

click me!