శృంగారంలో రిస్కీ పొజిషన్ ట్రై చేయడంతో పురుషాంగం ఫ్రాక్చర్.. ఎమర్జెన్సీ సర్జరీ చేసిన వైద్యులు

By Mahesh KFirst Published Apr 12, 2023, 4:14 AM IST
Highlights

ఓ వ్యక్తి అత్యంత రిస్కీ పొజిషన్ అయిన రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ ట్రై చేశాడు. ఆ పొజిషన్‌లో శృంగారంలో పాల్గొనగా అతని పురుషాంగం ఫ్రాక్చర్ అయింది. యురెత్రా కూడా డ్యామేజీ అయింది. దీంతో మూత్ర విసర్జన చేయలేకపోయాడు. హాస్పిటల్‌కు వెళ్లగా వైద్యులు ఎమర్జెన్సీ సర్జరీ చేశారు.
 

న్యూఢిల్లీ: ఇండోనేషియాకు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ఓ రోజు హుషారుగా సంభోగంలో పాల్గొన్నాడు. దూకుడు పెంచాడు. అయితే అతను ఓ రిస్కీ పొజిషన్‌ను ట్రై చేశాడు. దాని కారణంగా అతని పురుషాంగం ఫ్రాక్చర్ అయింది. కనీసం మూత్రం కూడా విసర్జించలేక వేదన అనుభవించాడు. వెంటనే హాస్పిటల్‌కు పరుగు పెట్టాడు. వైద్యులు వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేశారు.

ఆ వ్యక్తి తన భాగస్వామితో కలిసి రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ ట్రై చేశాడు. అతను వెల్లకిలా పడుకుంటే.. ఆమె పైనకు వచ్చి అతని కాళ్ల వైపు ముఖం ఉంచి శృంగారం చేసింది. ఈ సమయంలో అతనికి ఏదో విరిగినట్టు శబ్దం వచ్చింది. వెంటనే తన పురుషాంగంలో నొప్పి కలిగింది. కాసేపట్లోనే వాచిపోయింది. మూత్ర విసర్జన కూడా చేయలేకపోయింది. తీవ్రమైన నొప్పి కలిగింది. దీంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చింది.

అతని పెనిస్ ఫ్రాక్చర్ అయినట్టుగా వైద్యులు గుర్తించారు. అంతేకాదు, మూత్రం వెళ్లే ట్యూబ్ యురెత్రా కూడా గాయపడినట్టు గమనించారు. వైద్యులు ఆ వ్యక్తికి చికిత్స అందించారు. నెల రోజుల్లోనే ఫుల్ రికవరీ అయ్యాడు. 

Also Read: సెక్స్ లైఫ్ బాగుండాలంటే .. పురుషుల్లో ఇది పెరగాల్సిందే..!

పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు దానికి బలంగా ఏదైనా తాకి వంచితే అప్పుడు పెనైల్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన తొలి కేసు 1924లో రిపోర్ట్ అయిందని ఓ అధ్యయనం పేర్కొంది. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల పురుషుల్లో ఇది సంభవించే అవకాశాలు ఉన్నాయని ఓ జర్నల్ తెలిపింది. కేవలం సెక్స్ చేసేటప్పుడు మాత్రమే కాదు.. మాస్టర్బేట్ చేసే సమయం లోనూ ఈ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నదని వైద్యులు చెప్పారు.

పురుషుడిపైకి భాగస్వామి వచ్చి సంగమించినప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని, అదే క్లాసిక్ మిషనరీ పొజిషన్‌లో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ అని ఓ స్టడీ పేర్కొంది.

click me!