పుతిన్ నన్ను యుద్ధ నేరస్థుడన్నారు.. అతను నాకు మంచి ఫ్రెండ్ కాదు: ఎలాన్ మస్క్

By Mahesh RajamoniFirst Published Apr 11, 2023, 3:38 PM IST
Highlights

Twitter chief Elon Musk: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌న‌ను యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు, కాబట్టి ఆయ‌న త‌న బెస్ట్ ఫ్రెండ్ కాదని ట్విట్ట‌ర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఎలన్ మస్క్ తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న క్ర‌మంలోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 
 

Elon Musk says Putin is not my best friend: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌న‌ను యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు కాబట్టి ఆయ‌న త‌న బెస్ట్ ఫ్రెండ్ కాదని ట్విట్ట‌ర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఎలన్ మస్క్ తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న క్ర‌మంలోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

వివ‌రాల్లోకెళ్తే..  ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను యుద్ధ నేరస్థుడు అని పిలిచారనీ, ఆయ‌న త‌న‌కు మంచి స్నేహితుడు కాదని ట్విటర్ చీఫ్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. రష్యా నాయ‌కులు, ప్ర‌జ‌ల‌ను ట్విట్ట‌ర్ లోకి ఎందుకు అనుమతిస్తున్నారని ఓ ట్విటర్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడైన ఎలాన్ మ‌స్క్ పై విధంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ కనుమరుగవుతుందని, ఎవరికీ అవసరం లేదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ స్క్రీన్ షాట్ ను అనాన‌మ‌స్ ఆపరేషన్స్ అనే ట్విట్ట‌ర్  యూజర్ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలోనే రష్యా నేతలను మళ్లీ  ట్విట్ట‌ర్ వేదికపైకి ఎందుకు అనుమతించారని మస్క్ ను ట్యాగ్ చేసిన యూజర్ ప్రశ్నించారు.

దీనికి స్పందించిన ఎలాన్ మ‌స్క్.. ఉక్రెయిన్ కు సహాయం చేసినందుకు పుతిన్ త‌న‌ను యుద్ధ నేరస్థుడిగా పిలిచారనీ, అందువల్ల అతను త‌న బెస్ట్ ఫ్రెండ్ కాదని పేర్కొన్నారు. "ఉక్రెయిన్‌కు సాయం చేసినందుకు పుతిన్‌.. న‌న్ను యుద్ధ నేర‌స్థుడ‌ని పేర్కొన్న‌ట్లు తెలిసింది. అందుకే ఆయ‌న నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఈ వార్తలన్నీ కొంతవరకు ప్రచారమే. దీనిపై ప్రజలే నిర్ణయించుకోనివ్వండి' అని మస్క్ తన సమాధానంలో పేర్కొన్నారు.

 

To

1. Is this a violation of TOS calling for genocide of
2. How is a terrorist state verified
3. Why did you allow leaders back on the platform lifting regulations against and officials
4. Why are you not abiding by sanctions pic.twitter.com/3pIyNBtjWp

— Anonymous Operations (@AnonOpsUnited)

 

ఈ ట్వీట్ యూజర్ల నుంచి విభిన్న అభిప్ర‌యాల‌ను వ్య‌క్తం చేసేలా చేసింది. కొంతమంది "ప్రతి ఒక్కరినీ స్వేచ్ఛగా మాట్లాడటానికి అనుమతించడం ముఖ్యం" అని వాదించారు. మ‌రొకొంద‌రు స‌త్యానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న విష‌య‌మే నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. కాగా, రష్యా ప్రభుత్వ మీడియా సంస్థల పరిధిని ట్విట్టర్ ఇకపై పరిమితం చేయడం లేదని టెలిగ్రాఫ్ శుక్రవారం తన నివేదికలో తెలిపింది. "ట్విట్టర్ సెర్చ్ ఫలితాలు, టైమ్ లైన్, సిఫార్సు సాధనాలు, పుతిన్ అధ్యక్ష ఖాతా, రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దాని యూకే రాయబార కార్యాలయాన్ని చూపిస్తున్నాయి.. ఇవన్నీ ఇరు దేశాల‌ శత్రుత్వం చెలరేగినప్పుడు వాటిపై ఆంక్షలు విధించబడ్డాయి" అని తెలిపింది.

ఇదిలావుండ‌గా, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్ లో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో స‌మాచార మార్పిడి  తీవ్రంగా బెబ్బ‌తిన్న స‌మ‌యంలో పౌరుల‌కు ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించ‌డానికి ఎలాన్ మ‌స్క్ కు చెందిన స్టార్ లింక్ ముందుకు వ‌చ్చింది.  మ‌స్క్ త‌న స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ఉక్రెయిన్ కు అందించారు.

click me!