సెక్స్ లైఫ్ బాగుండాలంటే .. పురుషుల్లో ఇది పెరగాల్సిందే..!
టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మీ భాగస్వామి ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది మరీ తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా మీ ఇద్దరి లైంగిక జీవితం ప్రభావితం అవుతుంది.
టెస్టోస్టెరాన్ అనేది పురుష సెక్స్ హార్మోన్. ఇది వృషణాలలో తయారవుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పురుష లైంగిక అభివృద్ధి, విధులకు చాలా ముఖ్యమైంది. యుక్తవయస్సులో ఈ టెస్టోస్టెరాన్ అబ్బాయిల శరీరం, గడ్డం, మీసాలు, లోతైన స్వరం, కండరాల బలం వంటి మగ లక్షణాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ హార్మోన్ వీర్యం తయారు చేయడానికి పురుషులకు చాలా చాలా అవసరం.
టెస్టోస్టెరాన్ స్థాయిలు సాధారణంగా వయస్సుతో పాటుగా తగ్గుతాయి. అందుకే వృద్ధులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కొంతమంది పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనిని టెస్టోస్టెరాన్ లోపం సిండ్రోమ్ (టీడీ) లేదా తక్కువ టెస్టోస్టెరాన్ అంటారు.
ఈ లక్షణాలు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను సూచిస్తాయి
తక్కువ సెక్స్ డ్రైవ్
అంగస్తంభన లోపం
జుట్టు రాలడం
గడ్డం సన్నబడటం
కండరాల బలహీనత
ఎప్పుడూ చాలా అలసిపోయినట్టుగా అనిపించడం
ఊబకాయం
డిప్రెషన్ లక్షణాలు
టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయా?
అనారోగ్యకరమైన జీవనశైలి లేదా కొన్ని రకకాల మందుల దుష్ప్రభావం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే జీవనశైలిని మెరుగుపర్చుకుంటే ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోవచ్చు. పురుషుల్లో సెక్స్ హార్మోన్ ను పెంచడానికి ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
sex
అధిక తీవ్రత కలిగిన వ్యాయామం
టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ సెక్స్ డ్రైవ్ మెరుగుపడుతుంది. అలాగే మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.
ఆరోగ్యకరమైన బరువు
నిపుణుల ప్రకారం.. ఊబకాయం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఊబకాయం ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.
తగినంత నిద్ర
టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి తగినంత నిద్ర అవసరం. ఎందుకంటే గాఢంగా నిద్రపోయిన తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉదయం ఎక్కువగా ఉంటాయి. మంచి నిద్రతో మీలో ఒత్తిడి తగ్గుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది.
ఒత్తిడిని తగ్గించండి
దీర్ఘకాలిక ఒత్తిడి టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలను చేయండి. ఒత్తిడి వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. దీన్ని సకాలంలో గుర్తించకపోయినా లేదా నియంత్రించకపోయినా అది లైంగిక జీవితాన్ని కూడా దెబ్బతీస్తుంది.
సమతుల్య ఆహారం
ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తృణధాన్యాలు పుష్కలంగా ఉన్న ఆహారం టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. వీలైతే ఎక్కువ జంక్, వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచుతుంది.