దారుణం.. ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ.. ఐదుగురు కొలీగ్స్ ను కాల్చి చంపిన బ్యాంక్ ఉద్యోగి.. ఎక్కడంటే

By Asianet NewsFirst Published Apr 11, 2023, 8:52 AM IST
Highlights

యూనైటెడ్ స్టేట్స్ మళ్లీ కాల్పులతో మారుమోగింది. ఓ దుండగుడు తుపాకీతో తన సహోద్యోగులపైనే కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు చనిపోయారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. 

కెంటకీలోని డౌన్ టౌన్ లూయిస్ విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం తన ఆఫీసులో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిని ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాడు. ఈ ఘటనలో ఐదుగురి ఉద్యోగులు మరణించారు. ఇందులో ఒకరు కెంటకీ గవర్నర్ సన్నిహితుడు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు సహా తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. వారు ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

అగ్నిపథ్ ను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఈ రిక్రూట్మెంట్ స్కీమ్ చెల్లుతుందని, ఏకపక్షం కాదన్న ధర్మాసనం

ఓల్డ్ నేషనల్ బ్యాంక్ లోపల కాల్పులు జరుగుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారని, ఎదురుకాల్పుల్లో దుండగుడు మరణించాడని లూయిస్ విల్లే మెట్రో పోలీస్ డిపార్ట్ మెంట్ చీఫ్ జాక్వెలిన్ గ్విన్-విల్లారోల్ తెలిపారు. దక్షిణాన 160 మైళ్ల (260 కిలోమీటర్లు) దూరంలోని టేనస్సీలోని నాష్విల్లేలోని క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ మాజీ విద్యార్థి ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెద్దలను చంపిన రెండు వారాల తర్వాత ఇది చోటు చేసుకుంది. ఈ ఏడాది దేశంలో 15వ సామూహిక హత్యాకాండ ఇది. ఆ కాల్పుల్లో ఆ రాష్ట్ర గవర్నర్, ఆయన భార్య స్నేహితులు కూడా చనిపోయారు.

పంజాబ్ పోలీసుల పెద్ద విజయం.. అమృత్ పాల్ సింగ్ అనుచరుడు పాపల్ ప్రీత్ సింగ్ అరెస్టు..

కాగా.. లూయిస్ విల్లేలో కాల్పులు జరిపిన వ్యక్తిని 25 ఏళ్ల కానర్ స్టర్జన్ గా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడుతున్నప్పుడు అతడు ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమింగ్ చేశారని అధికారులు తెలిపారు. అయితే ఈ వీడియోను తొలగించినట్టు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా ఒక ప్రకటనలో తెలిపింది. “ఈ ఉదయం జరిగిన విషాద ఘటన ప్రత్యక్ష ప్రసారాన్ని తొలగించాం’’ అని పేర్కొంది. 

భారత్ లో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ? 3 కారణాలు చెప్పిన ఐఎంఏ.. అవేంటంటే ?

హింసాత్మక, తీవ్రవాద కంటెంట్ ను నిషేధించడానికి సోషల్ మీడియా కంపెనీలు గత కొన్నేళ్లుగా కఠినమైన నిబంధనలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఆ ఆంక్షలను ఉల్లంఘించే పోస్టులు, స్ట్రీమ్ లను తొలగించేందుకు వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. కానీ లూయిస్ విల్లే కాల్పుల వంటి దిగ్భ్రాంతికరమైన విషయాలు కొన్ని సందర్భాల్లో బయటకు వస్తున్నాయి. దీనిపై చట్ట సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!