
భారత దేశానికి చెందిన 25 ఏళ్ల విద్యార్థిని అమెరికాలో పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం కోమాలోకి వెళ్లి మృత్యువుతో పోరాటం చేస్తోంది. యూహెచ్ (హ్యూస్టన్ యూనివర్శిటీ)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్న భారతీయ విద్యార్థిని 25 ఏళ్ల కోడూరు సుశ్రూణ్య జూలై 4వ తేదీన శాన్ జెసింటో స్మారక పార్కు వద్ద స్నేహితులతో కలిసి చెరువు వెంట నడుచుకుంటూ వెళ్తోంది. ఈ సమయంలో ఆమెపై పిడుగుపడింది.
మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై ఆగ్రహం.. ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పు.. వీడియో వైరల్
దీంతో ఆమెను వెంటనే స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఆమెపై పిడుగు పడిన వెంటనే చెరువులో పడిపోయిందని, దీంతో ఆమె గుండె లయ తప్పిందని ఆమె బంధువు సురేంద్రకుమార్ చెప్పారు. అలాగే బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కోమాలోకి వెళ్లిందని చెప్పారు. కాగా సుశ్రూణ్యకు వైద్య ఖర్చులకు భారీగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీంతో దాతల నుంచి సాయం కోరేందుకు కుటుంబ సభ్యులు ‘గోఫండ్‌మీ’ని ఆన్ లైన్ లో రూపొందించారు.
మెనూ ప్రకారం భోజనం తయారు చేయడం లేదని ఫిర్యాదు.. ప్రిన్సిపాల్, సూడెంట్లకు మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
ఆమె సాధారణ మనిషిగా తిరిగి వచ్చేందుకు దాతలు సాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు ఆ పేజీలో చేశారు. ఆమెకు చాలా సుదీర్ఘమైన ట్రీట్ మెంట్ అవసరం ఉందని, అలాగే చాలా ఖర్చుతో కూడిన వైద్యం అవసరమని ఆమె బంధువు సురేంద్ర కుమార్ చెప్పారు. భారత్ లో ఉన్న తన తల్లిదండ్రులను హ్యూస్టన్ కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. వారు పక్కన ఉంటే సుశ్రూణ్య త్వరగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం సుశ్రూణ్య మెదడు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లిపోయింది. సొంతంగా శ్వాస తీసుకోలేకపోతోంది. ట్రాకియోస్టోమీతో వెంటిలేటర్ సపోర్ట్ అవసరం. మెదడు మామూలు పనితీరుకు వచ్చే వరకు ఆమెకు పోషకాహారం అందించడానికి పీఈజీ (పెర్కుటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టోమీ) ట్యూబ్ ను ఉపయోగిస్తున్నారు.