
న్యూజిలాండ్ లో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ కు వేదికైన ఆక్లాండ్ లో టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఈ కాల్పులు చోటుచేసుకోవడం విశేషం. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, పోలీసు అధికారులతో సహా మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ ప్రకటించారు.
ఫిఫా వరల్డ్ కప్ కి మామూలుగానే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ఈ సారి ఈ ఫిఫా వరల్డ్ కప్ ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీంతో, ఈ మ్యాచ్ లు చూడటానికి వివిధ దేశాల నుంచి అభిమానులు న్యూజిలాండ్ చేరుకుంటున్నారు. దానికి తగినట్లుగానే ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలోనే ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ నార్వే మహిళల జట్ల మ్యాచ్ జరగడానికి కొద్ది గంటల మధ్య ఈ కాల్పుల కలకలం రేగాయి. ఒక వ్యక్తి నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరి కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై ఎటాక్ చేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు, ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.