
India Pakistan War: భారతదేశం-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు ఇప్పుడు సముద్ర జలాల్లోనూ తీవ్రతరం అయ్యాయంటూ వార్తలు వస్తుననాయి. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం, భారత నౌకాదళం కీలక చర్య తీసుకుందని పలు వార్తలు వచ్చాయి. అయితే వీటికి సంబంధించి ఇప్పటి వరకూ అధికార ప్రకటన ఏమీ రాలేదు. కానీ పలు జాతీయ చానెళ్లు మాత్రం కరాచీ పోర్టుపై భారత నావికాదళం దాడులు చేసిందన్న వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తల ప్రకారం.. ఇదీ స్టోరీ..
పాకిస్థాన్‌లోని కరాచీ పోర్ట్‌పై భారత నౌకాదళం క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడిలో కరాచీ పోర్ట్‌కు తీవ్ర నష్టం కలిగినట్టు సమాచారం. పోర్ట్‌లోని కొన్ని ముఖ్యమైన విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.
ఈ దాడిలో భారత నౌకాదళం నుంచి సముద్రంలో నుంచే అనేక టోమాహాక్ (Tomahawk), బ్రహ్మోస్ (BrahMos) తరహా క్షిపణులు ప్రయోగించబడ్డాయి. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ దాడి ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడినట్టు సమాచారం.
ఈ చర్య పాకిస్థాన్ సరిహద్దుల్లో జరిగిన దాడులకు ప్రతిగా తీసుకున్నదిగా అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడి ముఖ్యంగా పాకిస్థాన్ సైనిక, ఆర్థిక కార్యకలాపాలను భారీగా దెబ్బతీయడం లక్ష్యంగా తీసుకున్నదిగా తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో భారత నౌకాదళం తన శక్తివంతమైన యుద్ధ నౌక INS విక్రాంత్‌ను అరేబియా సముద్రంలో మోహరించింది. ఇటీవలే నౌకాదళంలో చేర్చబడిన INS విక్రాంత్ స్వదేశీ నిర్మాణంలో తయారైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్.
కరాచీ దాడిపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అయితే కరాచీలో అత్యవసర సేవలు అమలులోకి వచ్చాయి. పాకిస్థాన్ సైన్యం హై అలర్ట్‌కి వెళ్లింది. కొన్ని క్షిపణులను అడ్డుకున్నామని పాకిస్థాన్ పేర్కొన్నా, స్వతంత్ర వర్గాలు దీనిని నిర్ధారించలేదు.
కరాచీ పోర్ట్ పాకిస్థాన్‌లోని అతిపెద్ద, బిజీగా ఉండే పోర్ట్. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే కాక, సైనిక వ్యూహాత్మకతకూ కీలక కేంద్రంగా వ్యవహరిస్తుంది. ఈ పోర్ట్‌పై దాడి జరగడం పాకిస్థాన్‌కు ఆర్థిక, సైనిక పరంగా తీవ్ర లోటును తెచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని సమీక్షిస్తూ భారత రక్షణ విభాగం, భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి.
వాస్తవం: ఇవన్నీ ధృవీకరణ కాని విషయాలని తేలింది.