Afghanistan hunger crisis: ఆక‌లి కేక‌ల ఆఫ్ఘాన్..

By Mahesh Rajamoni  |  First Published Dec 12, 2021, 2:20 PM IST

Afghanistan hunger crisis: ఆఫ్ఘానిస్థాన్ ఆక‌లి కేక‌ల‌తో అల‌మ‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోంది. ఆఫ్ఘానిస్థాన్ లో  తాలిబాన్లు అధికారంలోకి వ‌చ్చాక ఆ దేశంలో ఆర్థిక ప‌రిస్థితులు రోజురోజుకూ మ‌రింత దిగ‌జారుతున్నాయి. తినిడానికి తిండిలేక అనేక మంది  ప్రాణాలు కోల్పోతున్న హృద‌య‌విదార‌క దృశ్యాలు ఆఫ్ఘాన్ లో నెల‌కొన్నాయి. 
 


Afghanistan hunger crisis: ఆఫ్ఘానిస్థాన్‌లో ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ప్ర‌జ‌లు తిన‌డానికి తిండిలేక ఆక‌లి కొర‌ల్లోకి జారుకుంటున్నారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ప్ర‌జ‌లు తిన‌డానికి తిండి కూడా కొన‌లేని విధంగా ప‌రిస్థితులు మారాయి. ఆఫ్ఘాన్‌లో తాలిబ‌న్లు అధికారం చేజిక్కించుకున్న‌ప్ప‌టి నుంచి అక్కడి ప‌రిస్థితులు దిగ‌జారిపోతున్నాయి. దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతుండడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వస్తువులు దిగుమతి కాకపోతుండడంతో ఈ పరిస్థితి వ‌చ్చింద‌ని స్థానిక‌ విక్రేత‌లు పేర్కొంటున్నారు.  ప్ర‌స్తుతం ఒక చిన్న బియ్యం బ్యాగ్ ధ‌ర 2 వేల 700 అప్ఘనీలు, పిండి బస్తా ధర 2,400 అప్ఘనీలు, 16 లీటర్ల నూనె 2 వేల 800 అప్ఘనీలకు పెరిగింది. రికార్డు స్థాయిలో పెరిగిన ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఒక‌పూట తిని మ‌రో పూట ప‌స్తులుంటున్నారు. ఆక‌లి బాధ త‌ట్టుకోలేక ఒకే కుటుంబంలో 8 మంది పిల్ల‌లు చ‌నిపోయార‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది.  అయితే, వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని అంతర్జాతీయంగా  ఆందోళన వ్యక్తమవుతోంది. 

Also Read: Nadendla Manohar: తెలంగాణ ఎంపీల లాగా ఎందుకు చేయట్లేదు? : నాదేండ్ల మనోహర్

Latest Videos

undefined

దేశంలో ఇలాంటి ప‌రిస్థితులు దాపురించినా కూడా తాలిబ‌న్ పాల‌కులు స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో ప‌రిస్థితులు మ‌రింత భ‌యంక‌రంగా మారుతున్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇంత‌కు ముందులా కాకుండా.. ఈ సారి మంచి పాల‌న కొన‌సాగిస్తామ‌ని పేర్కొన్న తాలిబ‌న్లు.. ఆ దిశ‌గా పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయడం లేదు. దీంతో ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం  ఆఫ్ఘ‌న్ క‌రెన్సీ అమెరిక‌న్ డాల‌ర్ మార‌క విలువతో పోలీస్తే అత్యంత స్థాయిలో ప‌త‌న‌మైపోతోంది. అంత‌ర్జాతీయంగా ఆఫ్ఘాన్ క‌రెన్సీ విలువ ప‌డిపోతుండ‌టంతో ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల‌కు కార‌ణం అవుతోంది. దీంతో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయికి పెరుగుతున్నాయి.

Also Read: Karnataka: బంగారు నెక్లెస్‌ని మింగిన ఆవు.. ఏం చేశారంటే..

ఆఫ్ఘానిస్థాన్ ప‌రిస్థితుల‌పై అంత‌ర్జాతీయంగానూ అందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దశాబ్దాలుగా పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆఫ్ఘాన్ ప్ర‌స్తుతం తీవ్ర ఆక‌లి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న‌ద‌ని అంత‌ర్జ‌తీయ సంస్థ‌లు పేర్కొంటున్నాయి. దేశంలోని స‌గానికి పైగా జ‌నాభా ఆక‌లి కొర‌ల్లో చిక్కుకున్నార‌నీ, దాదాపు 22.8 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల ప‌రిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయ‌ని the United Nations World Food Program and Food and Agriculture Organization అంచ‌నా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. రాకీయాలను మానవతావాద ఆవశ్యకత నుండి వేరు చేయవలసిన అవసరాన్ని ఈ నివేదిక‌లు నొక్కి చెప్పాయి.  ఆప్ఘాన్ లో ప్రస్తుతం చిన్నారుల పరిస్థితులు దుర్భలంగా మారాయని యూనిసెఫ్ అందోళన వ్యక్తం చేసింది. వీరికి స‌హాయం అందించ‌డానికి అంత‌ర్జాతీయ స‌మాజం ముందుకురావాల‌ని కోరింది. ప్ర‌పంచ బ్యాంకు సైతం ఆఫ్ఘాన్ ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న వ్య‌క్తంచేసింది. ఈ క్రమంలోనే ప‌లు చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధ‌మవుతోంది. 

Also Read: Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్‌ కొడుకు.. ఆ త‌ర్వాత ఏం జ‌గిందంటే?

click me!