
అమెరికాలోని (america) కెంటుకీలో (Kentucky) టోర్నడో (tornado) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం. ఈ నేపథ్యంలో కెంటుకీలో అత్యవసర పరిస్ధితి విధించారు గవర్నర్. కెంటుకీలోని పలు కౌంటలు టోర్నడో ధాటికి చివురుటాకులా వణికిపోయాయి. మేఫీల్డ్‌లోని ( Mayfield) ఓ కొవ్వొత్తుల ఫ్యాక్టరీపై (candle factory) పైకప్పు కూలిపోవడంతో భారీ సంఖ్యలో క్షతగాత్రులయ్యారని గవర్నర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.