హ్యాకింగ్ కు గురైన బ్రెజిల్ ఆరోగ్య శాఖ వెబ్ సైట్.. వ్యాక్సినేషన్ డాటా చోరీ..

Published : Dec 11, 2021, 06:08 PM IST
హ్యాకింగ్ కు గురైన బ్రెజిల్ ఆరోగ్య శాఖ వెబ్ సైట్.. వ్యాక్సినేషన్ డాటా చోరీ..

సారాంశం

బ్రెజిల్ ఆరోగ్యశాఖకు సంబంధించిన వెబ్ సైట్ హ్యాకింగ్ గురైంది. వ్యాక్సినేషన్, ఇతర ముఖ్యమైన సమాచారం చోరీ అయ్యాయి. 

బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ శుక్రవారం హ్యకింగ్ కు గురయ్యింది. వ్యాక్సినేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం చోరి అయ్యింది.ఆరోగ్య శాఖ‌ వెబ్ సైట్ హ్యాకింగ్‌కు గురైన ఘ‌ట‌న‌పై బ్రెజిల్ ఆరోగ్య శాఖ స్పందించింది. హ్యాకింగ్ గురైన మాట వాస్త‌వ‌మే అని ధృవీక‌రించింది. వ్యాక్సినేష‌న్‌కు సంబంధించిన స‌మాచారాన్ని క‌లిగి ఉన్న ఒక వ్య‌వ‌స్థ‌, వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్‌లను జారీ చేసిన మ‌రో వ్య‌వ‌స్థ‌ను ఈ హ్యాక‌ర్లు చోరీ చేశార‌ని తెలిపారు. దీని వ‌ల్ల బ్రెజిల్‌కు వచ్చే సందర్శకులకు అధ‌నంగా తాము అమ‌లు చేస్తున్న ఆరోగ్య ప‌రీక్ష‌ల అమ‌లును వారం పాటు నిలిపివేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది.  శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. 

అమెరికా: కెంటుకీలో టోర్నడో బీభత్సం.. 50 మందికిపైగా మృతి, ఇంకా పెరిగే అవకాశం
ఆరోగ్య శాఖ కు సంబంధించిన వెబ్ సైట్ల‌ను హ్యాక్ చేసి హ్యాక‌ర్లు తామే డాటా చోరీ చేశామ‌ని తెలిపారు. ‘‘మీ డాటా కాపీ చేసి మేము తీసుకున్నాం. తరువాత దానిని అందులో నుంచి డిలీట్ చేశాం. మీకు డాటా కావాలంటనే మమల్ని సంప్రదించండి’’ అంటూ వారు అందులో ఒక ప్ర‌క‌ట‌న‌ను ఉంచారు. అది శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఉండి.. త‌రువాత క‌నిపించ‌కుండా పోయింది. అయితే ఈ హ్యాకింగ్ వ‌ల్ల ఇప్ప‌టికీ ఆ వెబ్ సైట్ డౌన్‌లోనే ఉంది. బ్రెజిల్‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కులు ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి, త‌రువాత కోవిడ్ ప‌రీక్ష చేసుకోవాలి. ఈ నిబంధ‌న శ‌నివారం నుంచే అమ‌లులోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు జ‌రిగిన హ్యాకింగ్ వ‌ల్ల ఈ కొత్త నిబంధ‌న‌లు వారం రోజుల పాటు నిలిపివేస్తున్నామ‌ని బ్రెజిల్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే