భారత్‌లో చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేయడం వెనుక అమెరికన్ బిలియనీర్.. న్యూయార్క్ టైమ్స్ పరిశోధనతో బహిర్గతం..!

Published : Aug 07, 2023, 01:45 PM ISTUpdated : Aug 07, 2023, 01:51 PM IST
భారత్‌లో చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేయడం వెనుక అమెరికన్ బిలియనీర్.. న్యూయార్క్ టైమ్స్ పరిశోధనతో బహిర్గతం..!

సారాంశం

చైనా తన వైఖరిని సూక్ష్మంగా ముందుకు తీసుకెళ్లడానికి, తమపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఎలా ఉపయోగిస్తుందనే విషయాలను ది న్యూయార్క్ టైమ్స్ వివరణాత్మక పరిశోధన ద్వారా బహిర్గతమైంది. 

చైనా తన వైఖరిని సూక్ష్మంగా ముందుకు తీసుకెళ్లడానికి, తమపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఎలా ఉపయోగిస్తుందనే విషయాలను ది న్యూయార్క్ టైమ్స్ వివరణాత్మక పరిశోధన ద్వారా బహిర్గతమైంది. కార్యకర్తల సమూహాలు, లాభాపేక్ష లేని సంస్థలు, షెల్ కంపెనీలకు చైనా, చైనీస్ ప్రచారంతో సన్నిహిత సంబంధాల  క్లిష్టమైన వెబ్‌ను ఈ పరిశోధన వెల్లడించింది. ఈ నెట్‌వర్క్‌లో ముఖ్యమైన వ్యక్తి అమెరికా బిలియనీర్, టెక్ మాగ్నెట్ నెవిల్లే రాయ్ సింఘమ్ అని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ‘‘భారత వ్యతిరేక’’ శక్తులకు సహకరిస్తున్న విదేశీ అంశాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్న విషయాన్ని బీజేపీ హైలైట్ చేసింది. 

మీడియా ప్లాట్‌ఫారమ్ న్యూస్‌క్లిక్ దాదాపు రూ. 38 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలిన రెండేళ్ల తర్వాత ఈ పరిశోధన బహిర్గతం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూస్ క్లిక్‌కు నిధుల ప్రవాహంలో మ్యాప్ చేస్తున్న ఈడీ వర్గాలు.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రచార విభాగంతో నెవిల్లే రాయ్ సింఘమ్ సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించాయి.

ఇక, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రచార విభాగంతో ముడిపడి ఉన్న అమెరికన్ బిలియనీర్‌ నెవిల్లే రాయ్‌కు నిధుల ప్రవాహం న్యూయార్క్ టైమ్స్ పరిశోధనలో గుర్తించబడింది. న్యూ ఢిల్లీలోని న్యూస్‌క్లిక్ అనే వార్తా సైట్‌కి సింఘమ్ నెట్‌వర్క్ నిధులు సమకూర్చిందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది, ఇది చైనా ప్రభుత్వం మాట్లాడే అంశాలను తన కవరేజీలో పొందుపరిచింది. చైనా తన వైఖరిని సూక్ష్మంగా ప్రచారం చేయడానికి, విమర్శలను తిప్పికొట్టడానికి కార్యకర్తలు, ఎన్‌జీవోల గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఎలా ఉపయోగించుకుందో కూడా ఈ దర్యాప్తు బహిర్గతం చేస్తుంది.

నెవిల్లే రాయ్ సింఘం సమూహాలు చైనీస్ అనుకూల సందేశాలను ప్రచారం చేస్తూ.. ఆన్‌లైన్ ప్రసంగాన్ని మాత్రమే కాకుండా వాస్తవ-ప్రపంచ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తూ యూట్యూబ్ వీడియోలను ఎలా రూపొందించాయో దర్యాప్తు చూపిస్తుంది. ఈ సమూహాలు రాజకీయ నాయకులతో నిమగ్నమై ఉన్నాయి. అలాగే నిరసనలు నిర్వహించాయి, వివిధ దేశాలలో ఎన్నికలను ప్రభావితం చేశాయి.

ఈ కార్యకలాపాలు ఉన్నప్పటికీ.. నెవిల్లే రాయ్ సింఘమ్ లాభాపేక్ష రహిత సంస్థలను యూఎస్ విదేశీ ఏజెంట్ల నమోదు చట్టం క్రింద నమోదు చేసుకోకపోవడం.. విదేశీ శక్తులతో వారి సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సంస్థల ద్వారా గణనీయమైన నిధులు ప్రవహిస్తున్నప్పటికీ.. ఈ సంస్థలతో తన సంబంధాలను మరుగున పరచడానికి సింఘమ్ చేసిన ప్రయత్నాలను కూడా న్యూయార్క్ టైమ్స్ నివేదిక హైలైట్ చేస్తుంది.

చైనీస్ ప్రభుత్వం కోసం పని చేయడాన్ని నెవిల్లే రాయ్ సింఘమ్ ఖండించినప్పటికీ, చైనా ప్రచారానికి అతని సంబంధాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. అతని నెట్‌వర్క్ షాంఘై ప్రచార విభాగం నిధులతో ఒక ప్రదర్శనను నిర్వహిస్తుంది. సభ్యులు ‘‘చైనా స్వరాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి’’ విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ వర్క్‌షాప్‌కు సింఘమ్ హాజరయ్యారనే నివేదికలు ఈ సంబంధాలను నొక్కి చెబుతున్నాయి.

మొత్తంగా న్యూయార్క్ టైమ్స్ పరిశోధన ఈ నెట్‌వర్క్ ప్రభావానికి సంబంధించిన లోతైన పరిధిని ప్రదర్శిస్తూ.. పబ్లిక్ డిస్కర్స్, విధాన నిర్ణయాలపై తప్పుడు సమాచారం ప్రభావితం చేసే క్లిష్టమైన విధానాలను వెల్లడిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !