ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 10 బోగీలు..  30 మంది మృతి..

Published : Aug 06, 2023, 07:26 PM IST
ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 10 బోగీలు..  30 మంది మృతి..

సారాంశం

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన షాజాద్‌పూర్ - నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం వెలుగు చూసింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌లోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది మృతి చెందారు. పాకిస్తాన్ జియో న్యూస్ నివేదిక ప్రకారం.. షాజాద్‌పూర్ మరియు నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పది కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 30 మంది మృతి చెందగా.. 80 మంది గాయపడ్డారు.

గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పలు రైళ్లను నిలిపివేశారు. అదే సమయంలో రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నవాబ్‌షాలోని పీపుల్స్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

రైలు ప్రమాదంలో 10 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ రెహమాన్ ధృవీకరించారు. మరింత సమాచారం రావాల్సిఉందని తెలిపారు. అదే సమయంలో.. ప్రభావిత బోగీల నుండి ప్రయాణికులను తరలించడానికి సహాయక బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. స్థానిక యంత్రాంగం ప్రకారం, ప్రమాదం తర్వాత సమీపంలోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని విధించారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు  

రైల్వే, విమానయాన శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. 15 మంది చనిపోయారని, పలువురు గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదం చాలా బాధాకరం. ప్రస్తుతం బాధిత ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రధానం. ఆ తర్వాత ఘటనపై విచారణ చేపట్టనున్నారు.

కాగా, ఘటనలో మృతి చెందిన వారి పట్ల సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు క్షతగాత్రులకు వెంటనే వైద్య సహాయం అందించాలని నవాబ్‌షా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో రైలు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం. గత దశాబ్ద కాలంలో పాకిస్థాన్‌లో అనేక పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !