Pakistan torrential rains : పాకిస్థాన్ లో కుండ‌పోత వ‌ర్షాలు.. క‌రాచీలో 20 మంది మృతి..

Published : Jul 13, 2022, 08:00 AM IST
Pakistan torrential rains :  పాకిస్థాన్ లో కుండ‌పోత వ‌ర్షాలు.. క‌రాచీలో 20 మంది మృతి..

సారాంశం

పాకిస్థాన్ లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. ముఖ్యగా దేశ ఆర్థిక కేంద్రమైన కరాచీలో వరదల నెలకొన్నాయి. ఈ నగరంలో వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో 20 మంది చనిపోయారు. 

గత వారం ప్రారంభమైన తాజా రుతుపవనాల కార‌ణంగా ప్ర‌స్తుతం పాకిస్థాన్ లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. దీంతో దక్షిణ ఓడరేవు నగరమైన కరాచీలో సుమారు 20 మంది మరణించారు. ఈ విష‌యాన్ని రెస్క్యూ కార్యకర్తలు, స్థానిక మీడియా నివేదించింది. నగరంలో గత 24 గంటల్లో వేర్వేరు వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో కనీసం ఆరుగురు మరణించారని రెస్క్యూ కార్యకర్తలు ‘జిన్హువా’తో చెప్పారు.

సెంట్రల్ జైలు నుంచి పారిపోవాలని గోడ దగ్గరి చెట్టు ఎక్కాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

వేర్వేరు ప్రాంతాల్లో విద్యుదాఘాతం కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో మోటర్‌బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారని రెస్క్యూ కార్యకర్తలు తెలిపారు. అలాగే ఉధృతంగా ప్ర‌వ‌హించే నీటి అల‌లు ఓ కారును డ్రైనేజీ కాలువలోకి తీసుకెళ్లాయి. దీంతో ఇద్ద‌రు వ్య‌క్తులు నీటిలో మునిగిపోయి చ‌నిపోయారు. మ‌రో ఘ‌ట‌న‌లో నీటిలో ప‌డి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మృత‌దేహాలు ఇంకా ల‌భించ‌లేదని రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు. 

దక్షిణ సింధ్ ప్రావిన్స్ రాజధాని, దేశ ఆర్థిక కేంద్రమైన కరాచీ ప్రస్తుత కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల వరద నీటితో ఇబ్బంది ప‌డుతోంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం సోమవారం మధ్యాహ్నం వరకు కురుస్తూనే ఉండడంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కరాచీ ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త సర్దార్ సర్ఫరాజ్ జిన్హువాతో మాట్లాడుతూ.. నగరంలో ఏర్పాటు చేసిన 18 రెయిన్ గేజ్‌ల‌లో ఇటీవ‌లి వ‌ర్ష‌పాతం సగటున 115.6 మిమీతో 52 మిమీ నుండి 342.4 మిమీ వరకు న‌మోదైంద‌ని తెలిపారు. ‘‘ వాతావరణ మార్పుల కారణంగా ఎక్కువ దక్షిణాసియా ప్రాంతంలో సాధారణ వాతావరణ విధానాలకు అంతరాయం ఏర్పడింది, దీని వల్ల కొన్నిసార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసి వరదలు, కొన్నిసార్లు లోటు వర్షాలు కరువుకు దారితీశాయి" అని ఆయన చెప్పారు.

వాతావరణ సంబంధిత సవాళ్లను అంచనా వేయడం ఇప్పుడు చాలా కష్టంగా మారిందని సర్ఫరాజ్ తెలిపారు. రుతుపవనాల భారీ భాగం ముగిసిందని, రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మరొక బలమైన రుతుపవన అల్పపీడన వ్యవస్థ గురువారం నాటికి సింధ్‌ను చేరుకునే అవకాశం ఉందని అన్నారు. మళ్ళీ కరాచీ పట్టణంలో వరదల వచ్చేలా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దేశం వదిలి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు.. మాల్దీవులకు వెళ్లిన గొటబాయ రాజపక్స

వర్షం కారణంగా ప్రజల భద్రత, పునరావాసం కోసం సమన్వయంతో కృషి చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాంతీయ ప్రభుత్వం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA)ని ఆదేశించారు. ప్రస్తుతం, రుతుపవనాల వర్షాల కారణంగా పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బలమైన వరదలతో బాధపడుతున్నాయి. కాగా గత మూడు వారాల్లో దేశవ్యాప్తంగా వేర్వేరు ఈ వర్షాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 97 మంది మరణించారు. 101 మందికి గాయాలు అయ్యాయని NDMA గత వారం నివేదించింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?