విదేశీ పర్యటన తర్వాత ప్రధానికి కరోనా పాజిటివ్.. మళ్లీ మహమ్మారి విజృంభణ!

By telugu teamFirst Published Nov 23, 2021, 4:11 PM IST
Highlights

ఫ్రాన్స్‌లో కరోనా ఘంటికలు మరోసారి భయంకరమవుతున్నాయి. దేశంలో ఇటీవలి వారాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, గతంలో ఫ్రాన్స్ ఎదుర్కొన్న పరిస్థితుల తీవ్రతతో లేకున్నా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా, ఆ దేశ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన పది రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
 

న్యూఢిల్లీ: Corona మహమ్మారి విశ్వరూపం చూపినప్పుడు అమెరికా, ఐరోపా దేశాలు విలవిల్లాడాయి. Franceలోనూ పరిస్థితులు చేయి దాటిపోయేదాక కేసులు వెళ్లాయి. మళ్లీ అవే భయాలు ఇప్పుడు ఫ్రాన్స్‌లో కనిపిస్తున్నాయి. తాజాగా, ఆ దేశ Prime Minister జీన్ కాస్టెక్స్(Jean Castex) కరోనా బారిన పడ్డారు. పొరుగు దేశం Belgium నుంచి తిరిగి వచ్చిన గంటల వ్యవధిలోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన పది రోజులు Isolationలో ఉండనున్నారు. అయితే, ఐసొలేషన్‌లో ఉంటూనే విధులు నిర్వహించనున్నారు.

ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ పలువురు మంత్రులు, ఉన్నత అధికారులతో కలిసి పొరుగు దేశం బెల్జియం పర్యటించారు. అక్కడ బెల్జియం ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డీ క్రూ తో సమావేశం అయ్యారు. సోమవారం ఉదయమే ప్రధాని జీన్ కాస్టెక్స్ ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చాడు. అయితే, సోమవారమే ఆయన కూతురుకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టు తర్వాత జీన్ కాస్టెక్స్ కూడా రెండు టెస్టులు చేసుకున్నాడు. ఈ రెండు టెస్టులూ పాజిటివ్ అనే వచ్చాయి. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ ఇది వరకే రెండు డోసుల టీకాలు వేసుకున్నాడు. ప్రధాని జీన్ కాస్టెక్స్‌కు కరోనా లక్షణాలు కనిపించాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.

Also Read: పాఠశాలలను వణికిస్తున్న కరోనా కేసులు.. జైపూర్‌లో 11 మంది విద్యార్థులకు పాజిటివ్

దీనిపై బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డీ క్రూ కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని డీ క్రూ కూడా కరోనా టెస్టులు చేయించుకోనున్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. మంగళవారం ప్రధాని డీ క్రూ కరోనా టెస్టు చేసుకుంటారని, ఆ తర్వాత ఫలితం వచ్చే వరకు స్వీయ ఐసొలేషన్‌లో ఉండబోతున్నట్టు వివరించారు. 

ఫ్రాన్స్‌లో 75 శాతం మంది జనాభాకు కరోనా టీకా పంపిణీ పూర్తయింది. అయినప్పటికీ ఇటీవలి వారాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. హాస్పిటల్‌లో కరోనాతో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య, కరోనా మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే దేశంలో కరోనా టెన్షన్ మళ్లీ పెరిగినట్టు తెలుస్తున్నది. అయితే, అధికారులు మాత్రం ఈ భయాందోళనలను కొట్టిపారేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఫ్రాన్స్‌లో కరోనాతో దాదాపు సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి కేసులు పెరుగుతున్నా.. అప్పటి తీవ్రత మాత్రం లేదని అధికారవర్గాలు తెలిపాయి.

Also Read: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కు కరోనా: స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన ప్రెసిడెంట్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్‌కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన సతీమణి బ్రిగిట్‌ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే, ఫ్రాన్స్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ మాత్రం ఇది వరకు కరోనా బారిన పడలేదు.

click me!