బల్గేరియాలో బస్సు ప్రమాదం.. చెలరేగిన మంటలు 48మంది మృతి...

By AN TeluguFirst Published Nov 23, 2021, 12:59 PM IST
Highlights

బల్గేరియాలో బస్సు బోల్తాపడిన ప్రమాదంలో 48మంది చనిపోయారు. ఈ అగ్నిప్రమాదం బస్సు బోల్తా పడడం వల్ల జరిగిందా? లేదా అగ్నిప్రమాదం జరిగాక బోల్తా పడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్‌ చెప్పారు. అయితే, ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగిందని అన్నారు.

సోఫియా : పశ్చిమ బల్గేరియాలోని హైవే మీద North Macedonian లైసెన్స్ ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 48 మంది మరణించారని అధికారులు తెలిపారు. అయితే, బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. కాలిన గాయాలతో ఏడుగురిని రాజధాని Sophiaలో ఆసుపత్రికి తరలించినట్లు అగ్ని మాపక భద్రతా విభాగానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధిపతి నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు. 

అంతేకాదు, bus బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందో లేదా fire accident జరిగాక బోల్తా పడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్‌ చెప్పారు. అయితే, ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగిందని అన్నారు. పైగా, బాధితుల్లో ఎక్కువమంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియన్ రాయబార కార్యాలయ అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా,  అగ్రరాజ్యం అమెరికాలోని విస్కన్ సిన్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పరేడ్ పైకి ఓ S.U.V వేగంగా దూసుకువెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో Christmas పండగను పురస్కరించుకుని విల్ వాకీ శివారులోని Wakisha Town లో ఆదివారం సాయంత్రం సంప్రదాయ వార్షిక పరేడ్ ను నిర్వహించారు. 

వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ ర్యాలీగా వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఓ ఎస్ యూవీ బారికేడ్లను ఢీకొట్టి మనుషుల మీదినుంచి దూసుకెళ్లింది. అక్కడున్న పోలీసుల అధికారి Carపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ ఆగకుండా వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఊహించని పరిణామంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు.

అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నది అధికారికంగా ఇంకా ధృవీకరించలేదని పేర్కొన్నాయి. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. 

తాలిబన్ల అరాచకం.. మహిళా నటులు కనిపించే షోలు ప్రసారం చేయద్దు.. మీడియాకు హుకూం జారీ...

Parade పైకి కారు దూసుకెల్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటనకు కారణమైన ఎస్ యూవీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే, ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి ఉగ్రకోణం లేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. 

కాగా, రెండు నవంబర్ 18న అమెరికాలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. వాషింగ్టన్ లో  ప్రముఖ Rapper Young Dolph లక్ష్యంగా ఓ గన్ పేలింది. టెన్నెస్సీలోని మెంఫిస్‌లో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో 36 ఏళ్ల యంగ్ డాల్ఫ్ దుర్మరణం చెందారు. మెంఫిస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కుకీ షాప్‌లో కాల్పులు జరిగాయి.

యంగ్ డాల్ఫ్ Tennesseలోని సొంత పట్టణం మెంఫిస్‌కు వచ్చాడు. ఇక్కడ ఆయన బంధువురాలు ఒకరికి క్యాన్సర్ సోకడంతో ఆమెను పరామర్శించడానికి సోమవారం మెంఫిస్ పట్టణానికి వచ్చాడు. అని సోదరి మరేనో మైర్స్ తెలిపింది. ఈ వారం మొదట్లోనూ ఆయన కుకీ షాప్‌నకు వెళ్లాడని ఆమె వివరించింది. ఈ రోజు కూడా ఆయన కుకీ షాప్‌లోపల ఉండగానే ఓ దుండగుడు షాప్‌లోకి వెళ్లి ర్యాపర్ యంగ్ డాల్ఫ్‌ను చంపేసినట్టు పేర్కొంది.

click me!