గాజాలో అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం.. మృతుల్లో 9 మంది చిన్నారులు..

Published : Nov 18, 2022, 08:56 AM ISTUpdated : Nov 18, 2022, 08:58 AM IST
గాజాలో అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం.. మృతుల్లో 9 మంది చిన్నారులు..

సారాంశం

గాజాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. ఇందులో 9 మంది చిన్నారులు ఉన్నారు. అక్కడి ప్రభుత్వం దీనిని జాతీయ విషాదంగా ప్రకటించింది. 

పాలస్తీనా దేశంలోని గాజా నగరంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. ఇందులో 9 మంది చిన్నారులు ఉన్నారు. పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌ను నియంత్రించే హమాస్ ఇస్లామిస్టులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

మిస్టరీ : చంద్రగ్రహణం తరువాత.. ప్రతీరోజూ రాత్రీ ఆ ఇంట్లో మంటలు.. కరెంట్ లేకున్నా షార్ట్ సర్క్యూట్...!!

వివరాలు ఇలా ఉన్నాయి. గాజా నగరానికి ఉత్తరాన ఉన్న జబాలియాలోని ఓ ఇంట్లో గురువారం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ ఇంట్లో ఇంధనం నిల్వ ఉండటమే ఈ అగ్నిప్రమాదానికి ప్రధాన కారణంగా మారింది. ఈ ప్రమాదంలో మొత్తంగా 21 మంది మరణించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తరువాత ఆ ఇళ్లు మొత్తం నల్లటి మట్టి దిబ్బలుగా మారిపోయింది.

ఈ ఘటనలో 21 మంది పౌరులు మరణించినట్టు గాజా పౌర రక్షణ విభాగం ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించింది. జబాలియాలోని ఇండోనేషియా ఆసుపత్రి అధిపతి సలేహ్ అబు లైలా ‘ఏఎఫ్ పీ’తో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో దాదాపు ఏడుగురు పిల్లల మృతదేహాలు లభ్యం అయ్యాయని చెప్పారు. ఈ ఘటనకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ఆ ఇంట్లో మాత్రం ఇంధనం నిల్వ ఉందని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి తెలిపారు.

మా అంకుల్ రేప్ చేశాడు, తాతయ్య వేధించాడు.. ఇది తెలిసి నాన్న కూడా అత్యాచారం చేశాడు...బాలిక ఆవేదన..

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్,  ప్రత్యేక పాలస్తీనా భూభాగం ఈ ఘటనను ‘‘జాతీయ విషాదం’’ గా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సంతాప దినంగా పాటించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మహమూద్ అబ్బాస్ తెలిపారని ప్రతినిధి నబిల్ అబు రుదీనెహ్ ఒక ప్రకటనలో చెప్పారు. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారిని మానవతా దృక్పథంతో ఆసుపత్రులకు (ఇజ్రాయెల్) తరలించడానికి తమ సిబ్బంది సహాయం చేస్తారని ట్వీట్ చేశారు.

2.3 మిలియన్ల మంది జనసాంద్రత కలిగిన గాజా.. 2007 నుండి ఇజ్రాయెల్ దిగ్బంధనంలో ఉంది. ఇక్కడ ఇలాంటి అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా తక్కువగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు కిరోసిన్ దీపాలు వెలిగించేందుకు, వెలుగు కోసం ప్రత్యామ్నాయ వనరులను నిల్వ చేసుకుంటూ ఉంటారు. 

సావర్కర్‌పై తమ పార్టీకి అపారమైన గౌరవముందంటూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విభేదించిన ఉద్ధవ్ థాక్రే

ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఐదు సంవత్సరాల కిందట కేవలం ఏడు గంటల విద్యుత్ సరఫరా అయ్యేది. ఈ ఏడాది సగటున గాజాకు ప్రతిరోజూ సగటున 12 గంటల మెయిన్స్ విద్యుత్ వస్తోంది.  అయితే చాలా మంది ఈ శీతాకాలంలో వేడి కోసం బొగ్గును కాల్చుతారు. దీంతో ఈ సమయంలోనే కొత్త ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?