గేమింగ్ ఎక్స్‌పర్ట్ సంధ్యా దేవనాథన్‌కు మెటా ఇండియా హెడ్‌గా బాధ్యతలు..    

Published : Nov 17, 2022, 03:02 PM IST
గేమింగ్ ఎక్స్‌పర్ట్ సంధ్యా దేవనాథన్‌కు మెటా ఇండియా హెడ్‌గా బాధ్యతలు..    

సారాంశం

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా సంధ్యా దేవ‌నాథ‌న్‌ను ఇండియా హెడ్‌గా నియ‌మించింది. ఆమె మెటా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఇటీవ‌లే మెటా నుంచి అజిత్ మోహ‌న్ వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. అతని స్థానంలో ఆమె విధులు నిర్వహించనున్నారు. 

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సంధ్యా దేవనాథన్‌ను భారతదేశానికి కొత్త హెడ్ గా నియమించింది. అలాగే ఆమె మెటా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఇటీవ‌లే మెటా నుంచి అజిత్ మోహ‌న్ వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఆయన స్థానంలో సంధ్య బాధ్యతలు చేపట్టనున్నారు. 2023, జనవరి 1 నుంచి ఆమె ఈ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. సంధ్య గేమింగ్‌లో నిపుణురాలిగా పరిగణించబడుతుంది. ఆమె గేమింగ్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి మహిళలను ప్రేరేపిస్తుంది.

ఈ నెల ప్రారంభంలో అజిత్ మోహన్ రాజీనామా చేసినట్లు తెలిసిందే.. అనంతరం ఆయన స్నాప్‌చాట్‌లో చేరారు. అజిత్ మోహన్ 2019 జనవరిలో ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంధ్య దేవనాథన్ 2016 నుండి ఫేస్‌బుక్‌లో పనిచేశారు. ఆమె సింగపూర్, వియత్నాంలో కంపెనీ వ్యాపారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంధ్యా దేవనాథన్ 2020లో APAC ప్రాంతానికి గేమింగ్‌కు నాయకత్వం వహించారు. ఆమె METAలో ఉమెన్ ఏపీఏసీకి ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్ వ్యవహరించారు.గేమింగ్ మార్కెట్‌లో మార్పు తీసుకురావడానికి Meta యొక్క పెద్ద ప్రాజెక్ట్ అయిన ప్లే ఫార్వర్డ్‌కు  సంధ్య దేవనాథన్ గ్లోబల్ లీడర్ గా వ్యవహరించారు. 

11వేల మందిపై వేటు 

ఇటీవల మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించిందిన విషయం తెలిసిందే. తొలగింపుల గురించి సమాచారం ఇస్తూ మెటా సీఈఓ, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మెటా చరిత్రలో ఇది అత్యంత కష్టమైన నిర్ణయం అని అన్నారు. ఈ చర్యకు ఉద్యోగులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆదాయాలు క్షీణించడం, టెక్నాలజీ పరిశ్రమలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో జుకర్‌బర్గ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?