పేరు మార్చుకున్న ఫేస్ బుక్... కొత్త పేరు ‘మెటా’...

By AN TeluguFirst Published Oct 29, 2021, 8:16 AM IST
Highlights

రానున్న దశాబ్దంలో వంద కోట్లమందికి ఈ వేదిక అందుబాటులోకి వస్తుందని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సామాజిక మాధ్యమంలో ఇన్ స్టా గ్రాం, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్ సెట్, హొరైజన్ వీఆర్ వంటివ భాగంగా ఉన్నాయని.. వాటన్నింటినీ ‘ఫేస్ బుక్’ అనే పేరు దర్పణం పట్టడం లేదని చెప్పారు. 

ఓక్లాండ్ : ‘ఫేస్ బుక్’ కంపెనీ పేరు మారింది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఈ మేరకు పేరు మార్పు విషయాన్ని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గురువారం వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతిక (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఫేస్ బుక్ కంపెనీ అధీనంలోని social media platforms అయిన face book, instagram, watsapp ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృసంస్థ పేరును మాత్రమే మార్చారు. ప్రజలు వర్చువల్ విధానంలో కలుసుకుని, పనిచేసి, ఉత్పత్తులను తయారు చేసే సరికొత్త వేదికగా మెటావర్స్ ను Mark Zugerberg చెబుతున్నారు. 

రానున్న దశాబ్దంలో వంద కోట్లమందికి ఈ వేదిక అందుబాటులోకి వస్తుందని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సామాజిక మాధ్యమంలో ఇన్ స్టా గ్రాం, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్ సెట్, హొరైజన్ వీఆర్ వంటివ భాగంగా ఉన్నాయని.. వాటన్నింటినీ ‘ఫేస్ బుక్’ అనే పేరు దర్పణం పట్టడం లేదని చెప్పారు. 

మళ్లీ వివాదాల్లోకి ఫేస్ బుక్... రూ.515 కోట్ల భారీ జరిమానా..!

తమను ప్రస్తుతం కేవలం సామాజిక మాధ్యమ సంస్థగానే పరిగణిస్తున్నారని తెలిపారు. కానీ వాస్తవానికి తమది ప్రజల మధ్య అనుసంధానతను పెంచేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే కంపెనీ అని వ్యాఖ్యానించారు.

‘Meta’ అనేది గ్రీకు పదమని చెప్పారు. ఫేస్ బుక్ పేపర్ల పేరిట ఇటీవల బయటపడ్డ పత్రాలతో సంస్థ తీవ్ర విమర్శల పాలైందని.. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సంస్థ పేరు మార్చారని విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం. 

భారీ జరిమానా...
కాగా, అక్టోబర్ 20న ప్రముఖ Social media Platform ఫేస్ బుక్ బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది.  తాము అడిగిన వివరాలు సమర్పించడం ఫేస్ బుక్ నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని,  అందుకే రూ. 515 కోట్లు.. అంటే  దాదాపు 50.5 మిలియన్ పౌండ్లు Fine చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది. 

నిన్న ఫేస్ బుక్, వాట్సప్ నేడు జీమెయిల్.. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన సేవలు..

ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని  హెచ్చరిక  పంపించాలన్న విధానాల మేరకు  ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.   యూనిమేటెడ్ సంస్థ జిఫీని  గత ఏడాది ఫేస్బుక్ కొనుగోలు చేసింది. అయితే, giphy కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్బుక్ నియంత్రిస్తోంది ఆరోపణలపై  బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అధారిటీ  విచారణ చేపట్టింది.  

ఈ వ్యవహారంలో వివరాలు ఇవ్వాలని కోరిన వాటిని సమర్పించడంలో ఫేస్ బుక్ ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేసిందని CMA పేర్కొంది. మరోవైపు  సీఎంఏ నిర్ణయంపై facebook స్పందించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. సీఎంఏ  నిర్ణయంపై సమీక్షించి తదుపరి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.

వరుస వివాదాలు...
ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభం నుంచి ఫేస్ బుక్ ఏదో రకంగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అక్టోబర్ 9న మరోసారి తమ యూజర్లకు క్షమాపణలు తెలియజేసింది. ఒకే వారంలో రెండు సార్లు ఫేస్ బుక్ సేవలకు అంతరాయం కలిగింది. 

ఈ నేపథ్యంలో.. ఫేస్ బుక్ తమ యూజర్లకు మరోసారి క్షమాపణలు చెప్పింది. ఇటీవల ఫేస్ బుక్, ఇన్ స్ట్రామ్ లు కొన్ని గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇలాంటి సంఘటన అక్టోబర్ 8న కూడా చోటుచేసుకుంది.

శుక్రవారం సైతం కొంత సేపు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లు పనిచేయలేదు. వాటి సేవలకు అంతరాయం కలిగింది. చాలా మంది వాటిని యాక్సెస్ చేసుకోలేకపోయారు. దీంతో.. ఫేస్ బుక్ ఈ ఘటనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. శుక్రవారం దాదాపు రెండు గంటలపాటు Facebook, Instagramసేవలకు అంతరాయం కలిగిందని.. వాటిని యాక్సెస్ చేసుకోలేక ఇబ్బంది పడిన యూజర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.

click me!