మహిళ పైశాచికత్వం.. 26వ అంతస్తునుంచి వేలాడుతూ నరకం చూసిన పెయింటర్స్...

By AN TeluguFirst Published Oct 28, 2021, 12:26 PM IST
Highlights

థాయ్‌లాండ్‌లోని ఓ ఎత్తైన సముదాయంలో నివసించే వ్యక్తి ఇద్దరు పెయింటర్ల పట్ల దారుణంగా వ్యవహరించింది. తను చెప్పిన మాట వినలేదని, చెప్పిన పని చేయలేదని కోపంతో వారి సపోర్ట్ తాడును కత్తిరించింది. 

బ్యాంకాక్ : రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం కరువవుతోంది. కసాయి తనం పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. ఇలాంటి దారుణమైన అమానుష ఘటనే థాయ్ లాండ్ లో జరిగింది. 

థాయ్‌లాండ్‌లోని ఓ ఎత్తైన సముదాయంలో నివసించే వ్యక్తి ఇద్దరు పెయింటర్ల పట్ల దారుణంగా వ్యవహరించింది. తను చెప్పిన మాట వినలేదని, చెప్పిన పని చేయలేదని కోపంతో వారి సపోర్ట్ తాడును కత్తిరించింది. 

ఆ తరవాత వారినలా వదిలేసి వెళ్లిపోయింది. 26వ అంతస్తు నుంచి వేలాడుతూ వారు నరకం అనుభవించారు. రెసిడెంట్స్ వీరిని గమనించి రక్షించేవరకు వారు అలాగే వేలాడుతూ ఉన్నారని పోలీసులు బుధవారం తెలిపారు. 

ఈ కేసులో మహిళ మీద attempted murder, ఆస్తి ధ్వంసం ఆరోపణలు మోపబడ్డాయని పోలీసులు తెలిపారు. థాయ్ రాజధానికి ఉత్తరాన ఉన్న పాక్ క్రెట్ పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ పొంగ్జాక్ ప్రీచకరున్‌పోంగ్ ది అసోసియేటెడ్ ప్రెస్‌తో ఈ విషయం తెలిపారు. 

అయితే, painters తాడును కత్తిరించడానికి గల కారణాలేంటో మాత్రం పోంగ్‌జాక్ చెప్పలేదు. అయితే కార్మికులు తన గది వెలుపల కనిపించడంతో ఆమె నిరుత్సాహానికి గురైందని, వారు అక్టోబర్ 12న పని చేస్తారని కాండో చేసిన ప్రకటనను చూడలేదని థాయ్ మీడియా నివేదించింది.

social mediaలో వైరల్ అవుతున్న ఒక వీడియో క్లిప్ లో, ఇద్దరు పెయింటర్లు 26వ అంతస్తులోని నివాసితులను కిటికీ తెరిచి లోపలికి అనుమతించమని అడిగారు. పెయింటర్స్ లో ఒకరైన సాంగ్ మయన్మార్ జాతీయుడు, తాను, అతని ఇద్దరు స్నేహితులు భవనంపై పగుళ్లను సరిచేయడానికి 32వ అంతస్తు నుంచి కిందికి దిగామని థాయ్ మీడియాతో చెప్పారు. 

30వ అంతస్తుకు చేరుకోగానే తాడు బరువైనట్లు భావించి కిందకు చూసే సరికి 21వ అంతస్తులో ఎవరో కిటికీ తెరిచి rope cut చేసినట్లు కనిపించింది. వెంటనే అతను సహాయం కోసం వేరే వారిని అర్థించాడు. కానీ ఆ చుట్టుపక్కల ప్లాట్స్ లో ఎవరూ లేరు. వీరిద్దరిని పైనుంచి గమనిస్తున్న మూడో సహోద్యోగి పై అంతస్తు నుండి వారికి మద్దతునిస్తూనే ఉన్నాడు. వారిని రక్షించిన నివాసి ప్రఫైవాన్ సెట్సింగ్  వచ్చేవరకు వారు అలాగే వేళ్లాడుతూ ఉన్నారు. 

ఒక పెయింటర్ సహాయం కోసం సిగ్నలింగ్ చేయడాన్ని ఆమె బ్రిటిష్ భర్త గమనించి, వారితో మాట్లాడటానికి ఆమెను పిలిచారని ప్రఫైవాన్ చెప్పారు. "ఈ సంఘటన దిగ్భ్రాంతికరమైనదని, అస్సలు జరగకూడనిదని" ఆమె అన్నారు.

ఛీ..ఛీ.. వీడు తండ్రేనా.. యేడాదిగా కూతురిపై అఘాయిత్యం.. జైలుకెళ్లొచ్చినా వదలనంటూ బెదిరింపు...

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాండో నిర్వాహకులు పెయింటర్స్ తో కలిసి వెళ్లారు. 34 ఏళ్ల మహిళ మొదట దీన్ని ఖండించింది. అయితే పోలీసులు తెగిపడిన తాడును, దానిమీద వేలిముద్రలను DNA విశ్లేషణ కోసం పంపినట్లు మీడియా నివేదించింది.

బుధవారం ఆ మహిళ, ఆమె లాయర్ పోలీస్ స్టేషన్‌ లో హాజరయ్యారు. పోలీసులు ఆమెకు సిసిటివి ఫుటేజ్, ఫోరెన్సిక్ సాక్ష్యాలను చూపించిన తర్వాత, ఆమె తన తప్పును ఒప్పుకుంది. అయితే తనకు కార్మికులను చంపే ఉద్దేశ్యం లేదని ఆమె తెలిపింది. 

అనుమానితుడిని తాత్కాలికంగా విడుదల చేసినట్లు పొంగ్జాక్ తెలిపారు. 15 రోజుల్లోగా ప్రావిన్స్ కోర్టులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేస్తారని ఆయన తెలిపారు. హత్యాయత్నం ఆరోపణలపై ఆమె నేరం రుజువైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
 

click me!