గుడ్‌న్యూస్: మౌత్ స్ప్రేతో 20 నిమిషాల్లో కరోనా ఖతం

By narsimha lodeFirst Published Jul 20, 2020, 7:54 PM IST
Highlights

కరోనాను నిరోధించేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం పలు ఫార్మా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా కీలక విషయాన్ని ప్రకటించింది. 20 నిమిషాల్లో కరోనా వైరస్ ను నిరోధించవచ్చని  స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ తెలిపింది.


న్యూయార్క్: కరోనాను నిరోధించేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం పలు ఫార్మా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా కీలక విషయాన్ని ప్రకటించింది. 20 నిమిషాల్లో కరోనా వైరస్ ను నిరోధించవచ్చని  స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ తెలిపింది.

స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ మౌత్ స్ప్రే ను తయారు చేసింది.  కోల్డ్ జైమ్ అనే  మౌత్ స్ప్రేను  తయారు చేసింది. ఈ మౌత్ స్ప్రే 20 నిమిసాల్లో కరోనా వైరస్ ను 98.3 శాతం వైరస్ ను నాశనం చేస్తోందని కంపెనీ పేర్కొంది. 

ఇన్-విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది.

నోటి ద్వారా వ్యాపించే ఇతర వైరస్‌లను కూడా ఇది నిరోధిస్తుందని ప్రకటించింది.  తాజా అధ్యయనంలో కోవిడ్‌-19 మహమ్మారిని పూర్తిగా నాశనం చేయడంలో దీని సామర్థ్యాన్ని అంచనా వేయనున్నామని పేర్కొంది. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్‌లో ఈ అధ్యయనం నిర్వహించామని వెల్లడించింది. ఇది స్వతంత్ర, గుర్తింపు పొందిన ధృవీకరించబడిన ల్యాబ్‌ అని ఎంజైమాటికా వివరించింది. 

also read:ప్లాస్మా పేరుతో మోసం: సందీప్‌ను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

 గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్లతో కూడిన సొల్యూషన్‌తో నిండిన కోల్డ్‌జైమ్‌ను ఉపయోగించి వైరసిడల్ ఎఫికసీ సస్పెన్షన్ పరీక్ష జరిగిందని కంపెనీ వెల్లడించింది.కోల్డ్‌జైమ్‌ను నోరు, గొంతు లోపలికి  స్ప్రే చేస్తే ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

దీంతో స్థానికంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఇన్ విట్రో ఫలితాల ద్వారా నేరుగా క్లినికల్ పరీక్షలకు వెళ్లే శక్తి లేనప్పటికీ సమర్థవంతంగా వైరస్‌ను ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడైందని ఎంజైమాటికా  సీఈఓ  క్లాజ్ ఎగ్‌స్ట్రాండ్  ప్రకటించారు.
 

click me!