కరోనా నుంచి రక్షిస్తున్న మాస్కులతో ప్రపంచానికి ముంచుకొస్తున్న ముప్పు

By Siva KodatiFirst Published Jul 16, 2020, 7:03 PM IST
Highlights

ఏ మూల నుంచైనా దాడి చేసే పవర్ ఉన్న కరోనా వైరస్  నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ ధరించడం ఒక్కటే పరిష్కారం. దీని కారణంగా మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది

ఏ మూల నుంచైనా దాడి చేసే పవర్ ఉన్న కరోనా వైరస్  నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ ధరించడం ఒక్కటే పరిష్కారం. దీని కారణంగా మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది.

కోవిడ్ కట్టడి కోసం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రభుత్వ అధికార వర్గాలతో పాటు సాధారణ ప్రజలు మాస్కులను విపరీతంగా వాడుతున్నారు. వీటిలో ఎన్ 95 మాస్కులతో పాటు సర్జికల్ మాస్కులు వంటి రకాలున్నాయి.

అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు ఈ మాస్కుల వినియోగం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారు.

Also Read:కరోనా కల్లోలం.. ప్రపంచ వ్యాప్తంగా కోటి36లక్షలు దాటిన కేసులు

అదే మన భారతదేశం విషయానికి వస్తే, సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి ( ఎంసీఐ) అంచనా వేసింది.

ఉపయోగించిన తర్వాత బయటపడేస్తున్న మాస్కుల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా కత్తిమీద సాముగా మారింది. కోవిడ్ 19 వ్యర్థాలను సక్రమంగా నిర్వహించే వ్యాధులు ప్రబలే ప్రమాదం వుంది.

ఈ ఏడాది సుమారు 130 బిలియన్ల మాస్కుల వ్యర్ధాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అందుకే డబ్ల్యూహెచ్‌ఓతో పాటు భారత ప్రభుత్వాలు సాలీడ్  వేస్ట్ మేనేజ్‌మెంట్‌‌పై మార్గదర్శకాలను నిర్దేశించాయి. 
 

click me!