చెల్లి కోసం కుక్కతో పోరాడిన 6ఏళ్ల బుడతడు, ముఖంపై 90 కుట్లు...

By Sreeharsha GopaganiFirst Published Jul 18, 2020, 9:11 AM IST
Highlights

చెల్లికి చిన్న గాయం కూడా కాకుండా చెల్లిని ఇంటికి చేర్చాడు. కుక్క దాడిలోఆ బుడతడు తీవ్రగాయాలపాలైనప్పటికీ... తన చెల్లి చేతిని మాత్రం వదల్లేదు. ఆ బుడతడు. ఆ బుడతడు ఆ కుక్క దాడిలో ఇంతతీవ్రంగా గాయపడ్డాడో తెలుసుకోవాలంటే ఆ బుడతడి ఫోటో చూస్తే సరిపోతుంది. ఆ పిల్లాడి మొఖంపై 90 కుట్లు పడ్డాయి. 

ఆరు సంవత్సరాల ఒక బుడతడు తన చెల్లిని తీసుకొని మిత్రుడి ఇంటి వెనుక బ్యాక్ యార్డులో నడుస్తున్నాడు. ఇంతలోనే ఒక కుక్క అతడి చెల్లి మీద దాడికి దిగబోతుండగా ఆ బుడతడు చెల్లిపాలిటి సూపర్ హీరోగా మారి కుక్కకు, చెల్లికి మధ్య నిలబడ్డాడు. 

చెల్లికి చిన్న గాయం కూడా కాకుండా చెల్లిని ఇంటికి చేర్చాడు. కుక్క దాడిలోఆ బుడతడు తీవ్రగాయాలపాలైనప్పటికీ... తన చెల్లి చేతిని మాత్రం వదల్లేదు. ఆ బుడతడు. ఆ బుడతడు ఆ కుక్క దాడిలో ఇంతతీవ్రంగా గాయపడ్డాడో తెలుసుకోవాలంటే ఆ బుడతడి ఫోటో చూస్తే సరిపోతుంది. ఆ పిల్లాడి మొఖంపై 90 కుట్లు పడ్డాయి. 

అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రంలో ఈ ఘటన చైతు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆరు సంవత్సరాల బ్రిడ్జర్ కి నాలుగు సంవత్సరాల చెల్లి ఉంది. చిన్నప్పటినుండి చెల్లి అంటే బ్రిడ్జర్ కి అమితమైన ప్రేమ. 

చెల్లితోపాటు మరో మిత్రుడితో కలిసి బ్యాక్ యార్డులో నడుస్తుండగా ఒక కుక్క బ్రిడ్జర్ చెల్లిపై దాడికి దిగబోతుండగా కుక్కకు చెల్లికి మధ్య అడ్డంగా నిలబడి చెల్లిని పారిపొమ్మని అరిచాడు. కుక్క అతడిని వదిలిన తరువాత చెల్లి చేయి పట్టుకొని ఇంట్లోకి వెళ్లి తలుపు వేసాడు. 

ఆ ఇంటి యజమాని ఎమర్జెన్సీ సర్వీస్ కి ఫోన్ చేసి అతడిని ఆసుపత్రిలో చేర్పించాడు. మొత్తంగా ముఖంపై 90 కుట్లు వేయాల్సి వచ్చింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినా తరువాత ఆ బాలుడు మాట్లాడుతూ.... ఒకవేళ మరణించాల్సి వస్తే తన చెల్లికి బదులుగా ఆ మరణించేది తానే అవ్వాలనుకున్నట్టుగా ఆ బుడతడు చెప్పాడు. 

ఆ బుడతడి వీరగాథను అతడి సమీప బంధువు సోషల్ మీడియాలో షేర్ చేసి అవెంజర్స్ సూపర్ హీరోస్ ని టాగ్ చేసింది. సెన్సషనల్ గా మారిన ఈ వార్త దెబ్బకు అవెంజర్స్ పాత్రధారులంతా ఆ బుడతడి హీరోయిజాన్ని మెచ్చుకుంటూ వీడియోలు, సందేశాలు పంపించారు. 

ఆ బుడతడి సాహసానికి ఇప్పుడు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. చెల్లి మీద ప్రేమంటే ఇది అని, అన్నతే ఉండాల్సింది ఇలానే అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు ఇంటర్నెట్ లో జనాలు. ఏది ఏమైనా ఆ వయసులో చెల్లి ప్రాణాలను కాపాడడం కోసం తన  ప్రాణాలను అడ్డేయడం నిజంగా గొప్ప విషయం. 

click me!