పాకిస్తాన్ ను కుదిపేసిన భూకంపం: 20 మంది మృతి, వందలాది మందికి గాయాలు

By telugu teamFirst Published Oct 7, 2021, 8:12 AM IST
Highlights

అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో పాకిస్తాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం వల్ల 20 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

క్వెట్టా: పాకిస్తాన్ ను భూకంపం కుదిపేసింది. గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ లో భూకంపం చోటు చేసుకుంది. అందరూ నిద్రపోతున్న సమయంలో విలయం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 20 మది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు 

భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. Earthquake వల్ల ఇళ్ల పైకప్పులు, గోడలు కూలడంతో మరణాలు సంభవించాయి. బలోచిస్తాన్ ప్రొవిన్స్ లో జరిగిన ఈ సంఘటనతో విద్యుత్తుకు అంతరాయం కలిగింది. దీంతో ఆరోగ్య కార్యకర్తలు ఫ్లాష్ లైట్ల వెలుగులో చికిత్స అందించారు. 

Also Read: జపాన్ లో భూకంపం.. సునామీ ముప్పు లేదు...

Pakistanలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న నగరం  Harnai భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయింది. సరైన రోడ్లు లేకపోవడంతో, విద్యుత్తు, మొబైల్ ఫోన్లకు తగిన సౌకర్యాలు కొరవడడంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. 

భూకంపం వల్ల 20 మంది మరణించినట్లు తమకు సమాచారం ఉన్నట్లు బలోచిస్తాన్ Balochistan హోం మత్రి మీరి జియా ఉల్లా లాంగౌ చెప్పారు. మృతుల్లో ఓ మహిళతో పాటు ఆరుగురు పిల్లలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల కోసం, క్షతగాత్రులకు చికిత్స అందించడానికి హెలికాప్టర్లను పంపించారు. 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బలోచిస్తాన్ ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధిపతి నసరీ నాజర్ చెప్పారు. టార్చీలు, మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుతురులో క్షతగాత్రులకు చికిత్స అందించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.  దాదాపు 40 మందికి ప్రాథమిక చికిత్స చేసి పంపించారు.

Also Read: Earthquake: జార్ఖండ్, అసోంలలో వెంటవెంటనే భూకంపాలు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగెత్తిన జనం

ఆస్పత్రిలో ఎమర్జెన్సీని విధించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స చేయడానికి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 

గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 20 కిలోమీటర్ల లోతులో 5.7 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలియజేసింది. భూకంపం ప్రభావం బలోచిస్తాన్ రాజధాని క్వెట్టాలో కూడా కనిపించింది.  

click me!