జేసీబీపై వివాహవేదిక వద్దకు నూతన వధూ వరులు.. పాకిస్తాన్ జంట వీడియో వైరల్

Published : Oct 06, 2021, 05:13 PM ISTUpdated : Oct 06, 2021, 05:18 PM IST
జేసీబీపై వివాహవేదిక వద్దకు నూతన వధూ వరులు.. పాకిస్తాన్ జంట వీడియో వైరల్

సారాంశం

ఆ జంట తమ పెళ్లిని తమతోపాటు అక్కడి ప్రజలూ ఎల్లకాలం గుర్తుంచుకునేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అందుకే పెళ్లి వేదిక వద్దకు జేసీబీపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ జంట ఈ ఆలోచన చేసింది. ఇలా చేయడానికి ఓ కారణముంది.  

న్యూఢిల్లీ: సాధారణంగా నూతన వధు వరులు తమ పెళ్లిని జీవితాంతం ఒక మధురజ్ఞాపకంగా మార్చుకోవాలని చూస్తారు. అందుకోసం ఎంత ఖర్చయినా భరించడానికి couples సిద్ధపడతారు అందరి దృష్టిని ఆకర్షించడానికి వినూత్న మార్గాలనూ అన్వేషిస్తుంటారు. తాజాగా, pakistanలోని ఓ జంట తమ పెళ్లి వేడక వద్దకు jcbపై వెళ్లారు. జేసీబీ ముందు నిలుచుని కెమెరాలకు ఫోజులిచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో వారి పెళ్లి హాట్ టాపిక్ అయింది. ఇరుగు పొరుగు వచ్చి అదో భారీ బహిరంగ ప్రదర్శనగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో viral అవుతున్నది. 

 

పాకిస్తాన్‌లోని హుంజా లోయలో ఈ వేడుక జరిగినట్టు తెలిసింది. ఈ వీడియోను పామిర్ టైమ్స్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న దంపతులు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన ట్విస్ట్ ఉన్నది. ఆ ఎక్స్‌కెవేటర్ వరుడికి చెందినది. ఆ వరుడు చేసే వృత్తిని నూతన వధువు గౌరవించాలని భావించింది. అందుకే భర్త వృత్తిని గౌరవించాలని నూతన వధువు, తన భార్య కోరికను నేరవేర్చి కొత్త మార్గాన్ని అనుసరించాలనే ఉబలాటంలో వరుడు.. ఇలా ఇరువురూ జేసీబీపై తరలివచ్చారు.

దీంతో ఆ నూతన దంపతులు తమ పెళ్లిని తమ జ్ఞాపకాల్లోనే కాదు.. అక్కడి ప్రజల జ్ఞాపకాల్లోనూ తమ పెళ్లిని సుస్థిరం చేయడంలో సఫలమయ్యారు. 

ఈ వీడియో పోస్టు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నది. ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలను జోడిస్తూ ట్వీట్లు చేశారు. కొందరు శెభాష్ అంటుండగా, ఇంకొందరు ఇది ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే