nobel prize 2021:రసాయనశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రైజ్

By narsimha lodeFirst Published Oct 6, 2021, 4:46 PM IST
Highlights

రసాయనశాస్త్రంలో  బెంజమిన్ లిస్ట్, డేవిడ్ వి.సి. మెక్‌మిల్లన్‌లకు నోబెల్ ప్రైజ్ దక్కింది. పరమాణువు నిర్మాణంలో ఆర్గానోక్యాటలిసిస్ అనే స్పష్టమైన నూతన పరికరాన్ని బెంజిమెన్ లిస్ట్, మెక్ మిల్లన్ అభివృద్ది చేశారు
 

స్టాక్‌హోం: జర్మనీలో జన్మించిన బెంజమిన్ లిస్ట్, డేవిడ్ వి.సి. మెక్‌మిల్లన్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో nobel prize దక్కింది.అసిమెట్రిక్ అర్గానోక్యాటలిస్‌ను అభివృద్ది చేసినందుకు గాను రసాయన శాస్త్రంలో వీరికి నోబెల్ ప్రైజ్ ను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ బుధవారం నాడు ప్రకటించింది.

also read:వైద్యశాస్త్రంలో డేవిడ్ జూలియస్, అర్డెమ్‌కు నోబెల్ పురస్కారం

పరమాణువు నిర్మాణంలో ఆర్గానోక్యాటలిసిస్ అనే స్పష్టమైన నూతన పరికరాన్ని బెంజిమెన్ లిస్ట్, మెక్ మిల్లన్ అభివృద్ది చేశారు.  అసమాన అణువులను ఉత్పత్తి చేయడాన్ని ఈ ప్రయోగం ద్వారా సులభతరం చేయడంతో రాయల్ స్వీడీష్ అకాడమీ వీరికి నోబెల్ ప్రైజ్ ను ప్రకటించింది.

పరమాణు నిర్మాణాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లిందని నోబెల్ కమిటీ ప్రకటించింది. స్వీడన్ లండ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ సోమ్‌ఫాయ్ ఈ పరిశోధనను గేమ్ ఛేంజర్ గా పేర్కొన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొత్త టూల్ అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మానవ జాతికి ఉపయోగపడుతుందన్నారు.నోబెల్ ప్రైజ్ కింద వీరిద్దరికి 10 మిలియన్ డాలర్లు అందుతాయి. 

 స్వీడిష్ పారిశ్రామికవేత్త అల్ప్రెడ్ నోబెల్ 1896లో నోబెల్ బహుమతులను ప్రకటించారు. తన మరణానికి ఏడాది ముందు తన వీలునామాలో ఈ విషయాన్ని  తెలిపారు.1901 నుండి 187 మంది కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అందుకొన్నారు. chemistryలో నోబెల్ ప్రైజ్ అందుకొన్న వారిలో ఏడుగురు మాత్రమే మఃహిళలున్నారు.బ్రిటిష్ బయో కెమిస్ట్ ఫ్రెడరిక్ సాంగర్ రెండు సార్లు నోబెల్ ప్రైజ్ దక్కించుకొన్నారు. 1958 1980లో  ఆయన నోబెల్ ప్రైజ్ ను పొందారు.

click me!