ఫ్లైట్‌లో టాయిలెట్‌లో శృంగారం.. డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్

By Mahesh K  |  First Published Sep 13, 2023, 1:57 PM IST

ఫ్లైట్‌లోని టాయిలెట్‌లో ఒక యువకుడు, ఒక యువతి శృంగారంలో పాల్గొన్నారు. ఫ్లైట్ అటెండాంట్ డోర్ ఓపెన్ చేయగానే.. వారు కాంప్రమైజింగ్ పొజిషన్‌లో ప్రయాణికులందరికీ కనిపించారు. దీంతో ఫ్లైట్‌ మొత్తం అరుపులో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
 


న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో విమానంలో జరిగే విషయాలు ఎక్కువగా వార్తలు అవుతున్నాయి. చాలా వరకు ఒక ప్యాసింజర్ మరో ప్యాసింజర్‌ను ఇబ్బంది పెట్టడం, దురుసుగా ప్రవర్తించే వార్తలు చూశాం. కానీ, తాజాగా బయటికి వచ్చిన వార్త మాత్రం వీటన్నింటికీ భిన్నమైనది. నమ్మశక్యంకానిది. ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా.. ఇద్దరు ప్రయాణికులు టాయిలెట్‌లోకి వెళ్లారు. టాయిలెట్‌లో వారు శృంగారం చేసుకుంటున్నారు. ఆ టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగానే వారు బండారం బయటపడింది. ఆ దృశ్యాలు చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయింది.

యూకేలో లుటోన్ నుంచి ఇబిజాకు వెళ్లుతున్న ఈజీ జెట్ ఫ్లైట్‌లో ఈ ఘటన సెప్టెంబర్ 8వ తేదీన జరిగింది. ఆ వీడియోలో ఫ్లైట్ అటెండాంట్ ఒకరు టాయిలెట్ డోర్ ముందు నిలబడి ఉన్నాడు. ఆయనను డోర్ తీయాలని ఇతరులు చెబుతున్నారు. ఆయన చాలా నెర్వస్‌గా బిహేవ్ చేశాడు. చివరకు ఆ డోర్ తీశాడు. దీంతో ఒక యువకుడు, ఒక యువతి కాంప్రమైజింగ్ పొజిషన్‌లో కనిపించారు. ఆ యువకుడు వెంటనే డోర్‌ను మళ్లీ వేసుకున్నాడు.

Latest Videos

డోర్ ఓపెన్ చేయగానే వారు చూసిన దృశ్యాలతో ప్రయాణికులు షాక్ అయ్యారు. చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. మరికొందరు అరుపుల్లో మునిగిపోయారు. ఇంకొందరు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అరిచారు. ఒకరిద్దరు ఆ ఘటనను వీడియో తీశారు. ఓ మై గాడ్ అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు.

Also Read: ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది దుర్మరణం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

ఫ్లైట్‌లో ఇబిజాలో ల్యాండ్ కాగానే వారిని పోలీసులకు అప్పగించారు. ఈజీ జెట్ ఎయిర్ లైన్స్ ఈ ఘటనను ధ్రువీకరించింది. వారిని అదుపులోకి తీసుకున్నామని, పబ్లిక్ టాయిలెట్‌లో అసభ్యంగా వ్యవహరించిన నేరం కింద వారిని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫ్లైట్ టాయిలెట్‌లో సెక్స్ నేరానికి సంబంధించిన చట్టాలేవీ యూకేలో లేవని కొందరు చెప్పారు.

ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీని కింద కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆయన పైలట్ కాడని నా ఆశాభావం అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇదెలా సాధ్యం అసలు.. ఒక్కడిని నిలబడటమే కష్టం అందులో అని సరదాగా వ్యాఖ్యానించారు.

click me!