కరోనాకు వ్యాక్సిన్ : మనుషులపై ‘‘mRNA-1273’’ ట్రయల్స్‌ ప్రారంభం

By Siva KodatiFirst Published Mar 17, 2020, 4:56 PM IST
Highlights

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాయి ఫార్మా కంపెనీలు. ఈ క్రమంలో అమెరికాలోని సియోటెల్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాయి ఫార్మా కంపెనీలు. ఈ క్రమంలో అమెరికాలోని సియోటెల్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాక్సిన్‌కు ‘‘mRNA-1273’’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.

ముందుగా ఈ వ్యాక్సిన్ ట్రయల్ నిర్వహించేందుకు 45 మందిని ఎంపిక చేశారు. వీరంతా 18-55 సంవత్సరాల మధ్య వయస్సు వారే. మంగళవారం ఈ వ్యాక్సిన్‌ను తొలిసారిగా ప్రయోగించనున్నారు.

Also Read:బిగ్ బ్రేకింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ట్రంప్ భారీ కుట్ర..?

అయితే దీనిని ఫెడరల్ ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఈ ప్రయోగానికి సంబంధించిన నిధులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సమకూరుస్తోంది. వ్యాక్సిన్ పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత వినియోగంలోకి తీసుకురావడానికి 18 నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.

మరోవైపు అమెరికాతో పాటుగా కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతమంది స్వల్పకాలిక వ్యాక్సిన్ల తయారీపైనా దృష్టి సారించారు. తద్వారా కొన్ని నెలల పాటు కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

Also Read:కరోనా వైరస్‌‌: వ్యాక్సిన్ తయారీ టీమ్‌కు మనోడే లీడర్

కాగా కరోనా వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ను హస్తగతం చేసుకునేందుకు కుట్ర పన్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన క్యూర్‌వార్ అనే ఫార్మా కంపెనీ కరోనా వైరస్‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌‌ను జూన్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.

దీంతో ట్రంప్ ఆ కంపెనీ పెద్దలకు భారీగా డబ్బు ముట్టజెప్పి దానిని అమెరికాకు తరలించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఓ పత్రిక కథనాన్ని ప్రకటించడం అంతర్జాతీయంగా దుమారాన్ని రేపింది. 

click me!