బిగ్ బ్రేకింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ట్రంప్ భారీ కుట్ర..?

By telugu news team  |  First Published Mar 16, 2020, 11:54 AM IST

కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తాను మాత్రమే దక్కించుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐరోపా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ఓ ప్రముఖ పత్రిక కథనం వెలువరించగా.. అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
 


ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు. చాలా దేశాల్లో ఈ వైరస్ కారణంగా హై అలర్ట్ ప్రకటించారు. స్పెయిన్, ఇటలీ దేశాల్లో అయితే... పిట్టలు రాలిపోయినట్లు.. ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. చైనా తర్వాత ఈ రెండు దేశాల్లోనే ఎక్కువ కరోనా కలకలం రేపుతోంది. ఇండియాలోనూ ఇప్పుడు దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది.

Also Read యమా డేంజర్... 24గంటల్లో 2వేల మందికి సోకిన కరోనా...

Latest Videos

undefined

ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలను లాగేసుకుంటున్న ఈ వైరస్ కి మందు కనుక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని దేశాలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... ఈ వైరస్ వ్యాక్సిన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తాను మాత్రమే దక్కించుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐరోపా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ఓ ప్రముఖ పత్రిక కథనం వెలువరించగా.. అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... జర్మనీలోని క్యూర్ వాక్  అనే ఔషధ పరిశోధన సంస్థ కరోనా వైరస్ ను నిర్మూలించే వ్యాక్సిన్ పరిశోధనల్లో కొంత పురోగతి సాధించింది. దీనిని ముందుగానే గుర్తించిన ట్రంప్... దానిని తన హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అందుకోసం సదరు పరిశోధన సంస్థకు భారీగా డబ్బులు కూడా ఆశపెట్టినట్లు సదరు మీడియా సంస్థ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఆ వ్యాక్సిన్ ని కేవలం అమెరికా ప్రజలకు మాత్రమే వినియోగించాలని ఆయన భావిస్తున్నట్లు మీడియా కథనం పేర్కొంది.

ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా.. కొద్ది రోజలు క్రితం ట్రంప్ క్యూర్ వ్యాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తో భేటీ అయ్యారు. దీంతో... సదరు మీడియా సంస్థ చేస్తున్న ఆరోపణలు నిజమనే పలువురు భావిస్తున్నారు. ఈ ఆరోపణలను జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి ధ్రువీకరించడం గమనార్హం. అయితే... ఆ వ్యాక్సిన్ ట్రంప్ చేతుల్లోకి వెళ్లకుండా... జర్మనీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

click me!